ప్రపంచ వ్యాప్తంగా సంచలం రేపిన తెలుగు చిత్రం ‘బాహుబలి’.  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యూజువల్ వండర్ గా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. అంతే కాదు తెలుగు చిత్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టింది.  అందే కాదు గత సంవత్సరం బాహుబలికి జాతీయ స్థాయి అవార్డు రావడం కూడా మరో విశేషం.  అయితే ఇప్పడు అందరి చూపు 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' పైనే ఉంది. ఎందుకంటే మొదటి పార్ట్ లో బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన కట్టప్ప..యుద్దసమయంలో బాహుబలిని వెన్నుపోటు పుడుస్తాడు.   యావత్ భారత దేశం ‘బాహుబలి 2’ చిత్రం కోసం ఎదురు చూస్తుంటే..కన్నడంలో మాత్రం ఈ చిత్రంపై వ్యతిరేకత వచ్చింది.  
Image result for BAAHUBALI 2
కావేరీ జలాలపై కొన్నేళ్ల క్రితం నటుడు సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్‌ క్షమాపణ చెప్పకపోతే బాహుబలి ది కన్‌క్లూజన్‌ సినిమాని కర్ణాటకలో విడుదల కానివ్వమని కొన్ని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి కన్నడలో తమ సినిమాకు సత్యరాజ్ (కట్టప్ప) కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కన్నడ సంఘాల సమాఖ్య రాజమౌళి కన్నడలో మాట్లాడినంత మాత్రాన గాయపడిన తమ మనోభావాలకు ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.
Image result for baahubali 2
ఇక లాభం లేదనుకొని సత్యరాజ్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  నేను కర్ణాటక, కన్నడిగులకు వ్యతిరేకిని కాను. తొమ్మిదేళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పున్నాను. కానీ తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనే ఉంటాను. నాకు సినిమా రంగంలో పని దొరక్కపోయినా ఫర్యాలేదు అన్నారు. రాజమౌళి కన్నడలో మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేస్తూ కన్నడిగులకు క్షమాపణలు  చెప్పారు.  దీనిపై నేటి ఉదయం వరకు బెట్టు చేసిన కన్నడ సంఘాల సమాఖ్య...కట్టప్ప క్షమాపణలు చెప్పడంతో 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' సినిమా విడుదలను అడ్డుకోమని ప్రకటించారు.
Image result for baahubali 2
అలాగే భవిష్యత్ లో కన్నడిగుల మనోభావాలు కించపరచవద్దని సూచించారు. మరోసారి కన్నడ ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వారు సూచించారు. తాము సత్యరాజ్ కు వ్యతిరేకం కానీ 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' సినిమాకు కాదని వారు తెలిపారు. దీంతో 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' చిత్ర యూనిట్ హాయిగా ఊపిరిపీల్చుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: