టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ గా చూసేది ఏమిటంటే…హీరోలు డైరెక్టర్స్ కి క్లాస్ పీకుతారు. ఎందుకంటే, హీరోకి కథ చెప్పేటప్పుడు డైరెక్టర్స్ అద్భుతంగా చెబుతారు. కానీ సినిమాని తెరకెక్కించేటప్పుడు మాత్రం చెప్పిందొకటి,చేసేదొకటి అన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా చేయటంతో కొన్ని షెడ్యూల్స్ తరువాత డైరెక్టర్స్ పనితీరు నచ్ఛక వీళ్ళకి హీరోలు క్లాస్ పీకటం జరగుతుంది. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సర్వసాధారణం.

కొన్ని సందర్భాల్లో టాప్ డైరెక్టర్స్ కి సైతం ఈ విధమైన క్లాస్....హీరోల నుండి ఎదురవుతుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇప్పుడు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. మురుగదాస్ స్పైడర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడని మహేష్ బాబు తన మూవీ పోస్టర్ పై ప్రస్థావన తీసుకువచ్చాడంట. ఇప్పటికే స్పైడర్ పోస్టర్ పై పలువురు సెలబ్రిటీలు రకరకాల కామెంట్స్ చేస్తున్న సంగంతి తెలిసిందే. 

1-నేనొక్కడినే..శ్రీమంతుడు సినిమా పోస్టర్ ను చూసినట్టుగా స్టైడర్ పోస్టర్ ఉందని అంటున్నారు. కొంత మంది అయితే స్టైడర్ పోస్టర్ లో దమ్ము లేదు అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ విషయంలో మహేష్ కాస్త వాయిస్ పెంచుదామని ట్రై చేశారట. కానీ మురుగదాస్ ఆ ఛాన్స్ ని మహేష్ కి ఇవ్వలేదని అంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం….మహేష్ బాబు నోటి దూకుడికి మురుగదాస్ గట్టిగా సమాధానం చెప్పాడంట.

స్పైడర్ మూవీకి సంబంధించిన పోస్టర్ డిజైనింగ్ లో కానీ,ప్రమోషన్స్ లో కానీ, విజువల్ బైట్స్ విషయంలో కానీ ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడని అంటున్నారు. సినిమాని ఎప్పుడు..ఏ విధంగా పైకి లేపాలో తనకు బాగా తెలుసని…ఇతరుల కామెంట్స్ ని పట్టించుకోవద్దని కూడ మురుగదాస్ చెప్పాడంట. దీంతో మహేష్ సైలెంట్ అయ్యాడని అంటున్నారు. మురుగదాస్ గతంలోనూ స్టాలిన్ మూవీ విషయంలో హీరో చిరంజీవి డామినేషన్ ని తట్టుకోలేక మూవీని సగంలోనే వదిలేసి వెళ్ళాడనే టాక్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి. మురుగదాస్ అలా వెళ్ళబట్టే స్టాలిన్ మూవీ యావరేజ్ గా నిలిచిందని అంటున్నారు. మెగాస్టార్ మూవీనే మధ్యలో వదిలేసిన వెళ్లిన మురుగదాస్ కి మహేష్ బాబు సినిమా పెద్ద లెక్క కాదని కోలీవుడ్ అంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: