టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రి ఇచ్చిన తీరు…అది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా తన రీ ఎంట్రి తో ఇండస్ట్రీలోని అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయటం కూడ జరిగిందని చెప్పవచ్చు. అప్పటి వరకూ బాహుబలి రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. బాహుబలి తరువాత సెకండ్ ప్లేస్ లో ఉన్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 అనే అంటారు.


ఖైదీ నెం 150 మూవీ కలెక్షన్స్ లు.. బాహుబలి మొదటి భాగం కలక్షన్స్ ని చాలా చోట్ల దాటేసింది. పలు ఏరియాల్లో బాహుబలి కంటే భారీ కలెక్షన్స్ ని ఖైదీ నెం 150 సాధించింది. దీంతో ఇప్పుడు బాహుబలి2 కి ఇది సవాల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చిరు రికార్డ్స్ ని బ్రేక్ చేయటానికి బాహుబలి2 రెడీ అయిందని అంటున్నారు. 


‘ఖైదీ నంబర్ 150’ ఫుల్ రన్లో 105 కోట్ల రూపాయల షేర్..అలాగే 160 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక తాజాగా బాహుబలి2 అంచనాలను చూస్తే ఈ మూవీ 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని వస్తుంది. మొదటి భాగం 600 కోట్ల రూపాయలను సాదించగా రెండో 1000 కోట్ల రూపాయలని సాధించాలనేది బాహుబలి2లక్ష్యం.


అలాగే మెగాస్టార్ చిరంజీవి ఫుల్ టైం గ్రాస్ అయిన 160 కోట్ల రూపాయలను…కేవలం ఒకే ఒక్క రోజుల భీట్ చేయాలనేది బాహుబలి2 టార్గెట్. దీంతో బాహుబలి2 కలెక్షన్స్ పై మెగాస్టార్ సైతం కాస్త ఆసక్తిని చూపుతున్నారు. ఇక కొంతమంది అయితే బాహుబలి2 మూవీ కలెక్షన్స్ మెగాస్టార్ చిరంజీవికి చుక్కలు చూపిస్తాయని అంటున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 28న ఘనంగా రిలీజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: