తెలుగు ఇండస్ట్రీలోకి ‘అష్టాచమ్మ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్..తర్వాత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  గత సంవత్సరం రిలీజ్ అయిన జ్యో అచ్చుతానంద మంచి విజయం సాధించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి ఫామ్ లో ఉన్న శ్రీనివాస్ బాలీవుడ్ లో హిట్ అయిన ‘హంటర్’ చిత్రాన్ని తెలుగులో ‘బాబు బాగా బిజి’ గా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా అడల్ట్ కాంటెంట్ గా చాలా కాంట్రవర్సీకి గురైంది..కానీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది.  

Image result for baabu baga busy

శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌ అభిషేక్ నామా , అవసరాల శ్రీనివాస్ హీరోగా , న‌వీన్ మేడారం ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని A స‌ర్టిఫికేట్ పొందింది.
Related image
 మే 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ప్ర‌స్తుతం ట్రేడ్ లో ఈ సినిమా ఓ సంచ‌ల‌నం గా మారింది. అన్ని ఎరియాల నుండి ప్ర‌తి డిస్ట్రిబ్యూట‌ర్ ఈ చిత్ర హ‌క్కులు కొన‌టం కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. మీడియం బ‌డ్జెట్ లో చేసిన ఏ చిత్రానికి రాని ట్రేడ్ లో క్రేజ్ ఇప్ప‌డు ఈ చిత్రానికి రావ‌టం అన్ని సెంట‌ర్స్ లో ఈ చిత్రాన్ని బిజినెస్ చేయ‌టం విశేషం. పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వుండ‌టం ఇంత క్రేజ్ కి కార‌ణం. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని  A స‌ర్టిఫికేట్ తో చిత్రం మే 5న పెర్‌ఫెక్ట్ స‌మ్మర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే బిజినెస్ ట్రేడ్ లో క్రేజ్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. పూర్తి వాణిజ్య‌విలువ‌లు క‌లిగివున్న చిత్రంగా మే నెల‌లో అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.  అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: