‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వివాదాలకు చాలదూరంగా ఉంటాడు. ఫిలింఇండస్ట్రీలో సామాన్యంగా కనిపించే పార్టీ కల్చర్ కు వర్గాలకు ప్రభాస్ చాలదూరం. అందువల్లనే అతడి పై గాసిప్పులు కూడ సామాన్యంగా కనిపించవు. అటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మనస్తత్వం పై రాజమౌళి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘బాహుబలి 2’ ను ప్రమోట్ చేస్తూ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈకామెంట్స్ చేసాడు.  

ప్రభాస్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి చాల బద్దకంగా ఉంటాడు అంటూ అంత బద్దకస్తుడుని తాను ఎప్పుడూ చూడలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రాజమౌళి. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వివరణ కూడ ఇచ్చాడు జక్కన్న. ఈమధ్య ముంబాయిలో ‘బాహుబలి 2’ ట్రైలర్ రిలీజ్ కోసం వెళ్లినపుడు తమకంటే ముందే ప్రభాస్ ఎయిర్ పోర్టుకు వెళ్ళిన సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు రాజమౌళి. 

ఆతరువాత హడావిడిగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తమకు ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లోని విఐపి లాంజ్ లో తీరికగా తన సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్న సందర్భాన్ని చూసి ఆశ్చర్యపోయిన సంఘటనను బయట పెట్టాడు. మరో అరగంటలో ఫ్లైట్ బయల్దేరుతుంది త్వరగా వెల్దాం ప్రభాస్ అంటూ తాను ప్రభాస్ పై ఒత్తిడి చేసినా ప్రభాస్ ఎలాంటి టెన్షన్ లేకుండా ‘నేనున్నాకదా డార్లింగ్  మీరు కష్టపడాలంటే రాజమౌళితో వెళ్లండి, కంఫర్టు కావాలంటే నాతోరండి’ అంటూ ఈసినిమాలోని తన సహనటులతో అనేసరికి తన మైండ్ బ్లాంక్ అయిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు రాజమౌళి. 

అంతేకాదు సెక్యూరిటీ చెక్ దగ్గర అంత క్యూ ఉంది ఆక్యూలో నేనెక్కడ నుంచుంటాను అంటూ ప్రభాస్ తనతో అనడంతో తాను కోపంతో ‘ఐదుగురు ఉన్నపుడు నువ్వురా, నేను టెన్షన్ తట్టుకోలేను అని చెప్పేసి తాను సెక్యూరిటీ చెక్ చేయించుకుని ఫ్లైట్ దగ్గరకు వెళ్లిన తర్వాత ప్రభాస్ బద్ధకం పై తనకు కోపంవచ్చింది అన్నవిషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. 

అయితే ప్రభాస్ మాత్రం మొత్తం క్యూ అయిపోయిన తర్వాత రాయల్ గా చిట్టచివరిన ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యే వరకు తాను పడ్డ టెన్షన్ మాటలలో చెప్పలేనిది అంటూ ప్రభాస్ అలసత్వం పై ఆసక్తికర సంఘటనలను బయటపెట్టాడు రాజమౌళి..  



మరింత సమాచారం తెలుసుకోండి: