కీరవాణి మంచి సంగీత దర్శకుడు మాత్రమే కాకుండా మంచి మాటకారి కూడ. దర్శకులను సినిమా పాటల రచయితలను సునిశితంగా విమర్శిస్తూ కీరవాణి మాట్లాడే మాటలలో ఒక లోతైన విశ్లేషణ ఉంటుంది. డబ్బుకోసమే  తాను సంగీత దర్శకుడుగా మారలేదని కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే తాను ఇప్పటి వరకు చేసాను అని చెపుతూ ‘నేను వృద్ధనారినే కానీ పతివ్రతను కాను’ అంటూ తన పై తానే సెటైర్లు వేసుకుంటున్నాడు కీరవాణి. 

ఈవారం విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ను ప్రమోట్ చేస్తూ కీరవాణి ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్ధిక స్థితి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు కీరవాణి. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినా తాను ఈ ఇండస్ట్రీలో పెద్దగా సంపాదించింది లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు కీరవాణి. 

తాను తన కుటుంబ సభ్యులను క్షేమంగా చూసుకునే స్థాయిలో సంపాదన సంపాధించాను కానీ ‘మగధీర’ సినిమా తరువాత కూడ తాను విలాస వంతమైన కారు కొనుక్కోలేక పోయాను అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు కీరవాణి. భారతదేశంలో ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరు ఉన్నా సొంతంగా రికార్డింగ్ ధియేటర్ లేని సంగీత దర్శకుడుని తాను మాత్రమే అంటూ ప్రస్తుత తరం యువ సంగీత దర్శకులతో పోల్చుకుంటే తాను సంపాదించింది ఏమిలేదు అంటూ ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు.

తాను చక్రవర్తి మహదేవన్ ఇళయరాజా దగ్గర సహాయకుడుగా పనిచేస్తున్నప్పుడు తన సంపాదన కేవలం వందలలో ఉండేది అన్న విషయాన్ని బయట పెడుతూ ప్రముఖ పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తికి చిన్నచిన్న పనులు చేసి పెడుతూ అప్పట్లో ఖర్చులుకని వందలలో చిన్నచిన్న మొత్తాలు తీసుకున్న సందర్భం తాను ఎప్పుడు మర్చిపోను అంటూ తన ఒకనాటి ఆర్ధిక స్థితి పై షాకింగ్ నిజాలు బయట పెట్టాడు కీరవాణి. తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో గీత రచయితలు వేటూరి సిరివెన్నెల లాంటి వాళ్ళు సంగీత దర్శకులను ఇది ఏమి ట్యూన్ అంటూ మందలించే వారని ఇప్పుడు అటువంటి పరిస్థుతులు ఎక్కడ ఉన్నాయి అని అంటూ సినిమా రంగంలో మాత్రమే కాదు మానవ జీవితాలలోనే విలువలు కరువై పోతున్నాయి అని కామెంట్స్ చేసాడు ఈ ప్రముఖ సంగీత దర్శకుడు..       



మరింత సమాచారం తెలుసుకోండి: