సూపర్ స్టార్ మ‌హేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ స్పైడర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఒకవైపు తను సినిమా రంగంలో బిజీగా ఉంటూనే…మరోవైపు మ‌హేష్ బాబు రియ‌ల్ బిజినెస్‌మేన్‌గా మారుతున్నాడు. ఓ వ్యాపారవేత్త తన అడుగులు ముందుకు వేస్తున్నాడు. 2017వ సంవత్సరం అందుకు వేధికగా మారిందని అంటున్నారు.


అయితే తన బిజినెస్ ని చిన్న మొత్తంలో కాదు…భారీగానే ప్రారంభిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… మ‌హేష్ బాబు మ‌ల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ కి ఆధరణ పెరుగుతుంది.


దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో మ‌ల్టీప్లెక్స్ లు నిర్మించాల‌నేది మ‌హేష్ బాబు ప్లాన్. ఇందుకు ఏషియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్ తో క‌లిసి ప్రిన్స్ ఈ కొత్త బిజినెస్‌లోకి దిగుతున్నాడు. నమ్ర‌తా మ‌హేష్ ఈ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. మల్టీప్లెక్స్ లో మ‌హేష్ బాబు ఇన్వెస్ట్ అమౌంట్ దాదాపు 150 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంటున్నారు. ఇవి కాకుండా మ‌హేష్ బాబు కాస్మోటిక్ ఉత్పత్తులపైనా ఇన్వెస్ట్ చేయనున్నారు.


ఇంటర్నేషనల్ బ్రాండ్ తో కలిసి పనిచేయనున్నట్టుగా తెలుస్తుంది.  ఇందులో మ‌హేష్ బాబు ఇన్వెస్ట్ చేసే మొత్తంగా 70కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా మ‌హేష్ బాబు ఒకవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు చేసుకునేందుకు తన ప్యూచర్ కెరీర్ ని రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.  ఇప్పటికే రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌హేష్ బాబు కొన్ని వ్యాపారాలు ప్లాన్ చేశాడ‌న్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: