కట్టప్ప ‘బహుబలి’ ని ఎందుకు చంపాడు అన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు ‘బాహుబలి 2’ లో సమాధానం దొరుకుతుందని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో ‘బాహుబలి 2’ లో కనిపించబోతున్న ఈ సీన్ గురించి కొన్ని ఆశక్తికర కధనాలు అప్పుడే ప్రచారంలోకి వచ్చేసాయి. ‘బాహుబలి’ కి వ్యతిరేకంగా భల్లాలదేవ అతని తండ్రి కలిసి శివగామికి నూరి పోయడంతో ఆమె కట్టప్పను ‘బహుబలి’ ని చంపమని ఆదేశించడం అతగాడు ‘బాహుబలి’ ని చంపేయడం జరుగుతుందట. 

అయితే ‘బాహుబలి ‘2  సినిమాలో ఇదేమంత ఎగ్జయిటింగ్ గా అనిపించదని తెలుస్తోంది. జస్ట్ సాదా సీదాగా అలా జరిగిపోతుందట. దీనితో దీనికోసమేనా ఇన్నాళ్లు ఇంత హడావుడి చేసింది అని ‘బాహుబలి 2’ ని  చూసిన ప్రేక్షకులకు అనిపించడం సహజం అన్న ప్రచారం జరుగుతోంది. అయితే కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు అన్న సన్నివేసం పక్కకు పెడితే ‘బాహుబలి 2’ ఆద్యంత విజువల్ వండర్ అని ఈ సినిమా  చూసిన ప్రేక్షకులకు అభిప్రాయం కలుగుతుంది అని టాక్.  

ఈ సినిమాలో వచ్చే చాలా సన్నివేసాలు హాలీవుడ్ స్టాండర్డ్ లోకి తీసుకు వెళతాయి అన్నవార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘బాహుబలి 2’ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా కథనం ప్రేక్షకుల ఊహకు అందని రేంజ్ లో పెద్ద ట్విస్టులు లేకుండా సాదాగా సాగుతుంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ముందు ఏమి జరుగుతుంది అన్న విషయాలు ప్రేక్షకులకు తెలిసిపోయేలా సన్నివేశాలు ఉంటాయి అన్నవార్తలు కూడ వస్తున్నాయి. అయితే ఈమూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ మటుకు ప్రేక్షకులకు బాగా నచ్చే విధంగా రాజమౌళి డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా 6500 వందల ధియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈమూవీ మొదటి రోజు కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్న విషయమై అంచనాలు కూడ రావడం లేదు అని అంటున్నారు. ఈమూవీ మొదటిరోజు కలక్షన్స్ 100 కోట్ల నుండి 200 కోట్ల మధ్య ఎవరూ ఊహించని ఒక షాకింగ్ ఫిగర్ కు సెటిల్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: