అందాల రాక్షసి సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరక్టర్ హను రాఘవపుడి. ఆ తర్వాత వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ కూడా ఆడియెన్స్ ను అలరించింది. నాని కెరియర్ లో సూపర్ హిట్ ఫాంను కొనసాగేలా చేసిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ప్రస్తుతం లై సినిమా చేస్తున్న హను మరోసారి నానితో సినిమా చేస్తున్నాడు.


వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న నాని రీసెంట్ గా నేను లోకల్ తో కెరియర్ హయ్యెస్ట్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రాబోతున్న సినిమా నిన్ను కోరి. శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ కాగా ఆది పినిశెట్టి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ లో రిలీజ్ అవుతుంది.


ఇక ఈ సినిమా తర్వాత హనుతో జతకట్టబోతున్నాడు నాని. సినిమా టైటిల్ గా అదిగో అల్లదిగో అని పెట్టబోతున్నారట. డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి. నాచురల్ స్టార్ గా నాని చేస్తున్న ఈ ట్రెండీ మూవీ కెరియరు మరింత బూస్టప్ ఇస్తుందని అంటున్నారు.

మరి నాని హను క్రేజీ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కృష్ణగాడిలా హిట్ ఇస్తుందా లేక నేను లోకల్ గా సూపర్ హిట్ అవుతుందా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: