బాలీవుడ్ అడల్ట్ కంటెంట్ వచ్చిన సినిమా హంటర్.. ప్రస్తుతం ఆ సినిమా తెలుగు రీమేక్ బాబు బాగా బిజీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇన్నాళ్లు సపోర్టింగ్ రోల్స్ తో అలరించిన అవసరాల శ్రీనివాస్ హీరోగా మిస్తి చక్రవర్తి, తేజశ్వి, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొంటున్నారు. 


ఈ క్రమంలో శ్రీముఖి మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుందట. అంతేకాదు కేవలం సినిమా ప్రమోట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోటో సెషన్ కోసం కూడా శ్రీముఖి అటెండ్ అవలేకపోయిందట. ఇదే విషయంపై శ్రీముఖి వాళ్ల తండ్రిని అడిగితే తన కాల్ షెడ్యూల్ మొత్తం సెండ్ చేశాడట. ఏ ఒక్క రోజు ఖాళ్లీ లేకుండా ఆమె కష్టపడుతుందని చెప్పాడట.


ఈమధ్య కాలంలో అటు సినిమాల్లోనూ బుల్లితెర మీద కూడా శ్రీముఖి ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. తన అల్లరి యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమ్మడు బాబు బాగా బిజీలో స్పెషల్ రోల్ చేస్తుంది. క్యూట్ గా ఉండే శ్రీముఖి బాబు బాగా బిజీలో హాట్ లుక్స్ తో కనబడుతుందని ఆడియెన్స్ ఆలోచన. శ్రీముఖి మాత్రం సినిమాలో అలాంటి సీన్స్ ఏమి లేవంటూ చెప్పుకొస్తుంది. 


ఫైనల్ గా సినిమాలో సర్ ప్రైజ్ ఇచ్చేందుకే అని తెలుస్తున్నా బుల్లితెర మీద మంచి ఇమేజ్ ఉన్న శ్రీముఖి ఈసారి సిల్వర్ స్క్రీన్ పై కూడా కచ్చితంగా ఆడియెన్స్ ను బుట్టలో వేసుకోవడం ఖాయమని తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: