ఇప్పుడు భారత దేశం అంతటా ‘బాహుబలి’ మానియా పట్టుకుంది.  ఎక్కడు చూసినా బాహుబలి అనే పేరు వినిపిస్తుంది.  దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన అద్భుతమ మాయ ‘బాహబలి’. ఇప్పటి వరకు తెలుగు లో ఏ సినిమాకు దక్కని కీర్తి ప్రతిష్టలు ఈ సినిమాకు దక్కాయి.  అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీపై కాస్త చిన్న చూపు ఉన్న బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు కళ్లు బైర్లు కమ్మేవిధంగా వ్యూజువల్ వండర్ క్రియేట్ చేస్తూ..బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించింది.  

అయితే ఈ చిత్రంలో బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప వెన్ను పోటు పొడుస్తాడు..ఎందుకు క్యూరియాసిటీ అందరిలో ఉంది.  అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బాహుబలి 2 చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడింది. రిలీజ్ కి కేవలం 4 రోజులు మాత్రమే ఉండడంతో టెక్నీషియన్స్ అందరు సినిమాకు సంబంధించిన సంగతులను షేర్ చేసుకుంటున్నారు. ఒక వైపు రాజమౌళి నిర్మాతలతో కలిసి ప్రమోషన్స్ చేస్తుంటే, మరో వైపు ప్రభాస్, అనుష్క, రానా పలు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

ఇక తాజాగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా ‘సాహోరే బాహుబలి’ వీడియో ప్రోమో సాంగ్‌ను విడుదల చేశారు టీం సభ్యులు. ఈ వీడియోని నిశితంగా పరిశీలిస్తే ప్రభాస్ వచ్చే సమయంలో పూలు చల్లుతున్నట్టుగా కొందరు కనిపించారు. అందులో రాజమౌళి కూతురు మయూఖ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతి కుమార్తె అనన్య, సంగీత దర్శకుడు కీరవాణి కుమార్తె కుముద్వతి, కెమేరామెన్‌ సెంథిల్‌ తనయులు రేయాన్‌, ధృవలు ఉన్నారు.  ఓ వైపు పెద్దలు అహర్శిశలూ కష్టపడుతుంటే వారి వారసులు కూడా మేము సైతం అంటూ సినిమాలో సందడి చేయడం అనేది సంథింగ్ స్పెషల్ అంటున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: