ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రం అంటే అది రాజమౌళి తెరకెక్కిన బాహుబలి మాత్రమే. అయితే తాజాగా బాహుబలి మించిన చిత్రం 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుందనే వార్త…బాహుబలిని చిన్నది చేసింది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ముందు బాహుబలి అత్యంత చిన్నదిగా మారింది.


అయితే 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వివరాలను ఓసారి చూస్తే…ప్రముఖ రచయిత,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా అత్యంత భారీ ప్రాజెక్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అఫిషియల్ గా 1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. వీరు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ‘ది మహాభారత’ అనే పేరును ఫైనల్ చేశారు కూడ. ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా. బి. ఆర్.శెట్టి నిర్మించనున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారు.


దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాని సైతం రెండు భాగాలుగా రూపొందించనున్నారు. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ, తెలుగు, ఆంగ్లం వంటి ప్రముఖ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన నిర్మాత…డైరెక్టర్ రాజమౌళి వద్దకు వచ్చి ఏదైనా సలహాలు కావాలని అడిగారంట. దీంతో రాజమౌళి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. తను బాహుబలి అనే సినిమాని తీసి సక్సెస్ సాధించాను కాబట్టి సరిపోయింది.


అయితే ఈ తరహా సాహసం మరోసారి చేయకూడదు అని నిర్ణయించుకున్నారంట. ఇక 1000 కోట్ల రూపాయల బడ్జెట్ పై తన చెప్పిన కామెంట్స్ ని కి ఆ నిర్మాత ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు. 1000 కోట్ల రూపాయలతో సినిమాని నిర్మిద్దాం అనే సాహసాన్ని మానుకోండి. ఇది ఎంతో భారీ ఖర్చు సినిమా అయినప్పటికీ…ఎంతో విలువైన సమయాన్ని ఇది వృదా చేస్తుందని చెప్పుకొచ్చారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: