‘బాహుబలి 2’ విడుదలకు ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈమూవీ మొదటి మూడు రోజుల టికెట్స్ వెనుక భారీ దందా జరుగుతోంది అంటూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.  భాగ్యనగరంలోని  చాల మల్టీ ఫ్లక్స్ ధియేటర్లు ‘బాహుబలి 2’ ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కార్పోరేట్ దందాకు తెర లేపుతున్నట్లుగా ఆ దిన పత్రిక తన కథనంలో అభిప్రాయ పడింది. 

ప్రేక్షకుల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ ల పేరిట ఒక కొత్త దందాకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ప్రేక్షకుల అభిరుచులతో సంబంధం లేకుండా కూల్‌ డ్రింక్, పాప్‌కార్న్ వంటి తినుబండారాలను ‘కాంబో ఆఫర్’ పేరుతో ప్రతి టికెట్ పై ఖచ్చితంగా కొనుగోలు చేసే విధంగా  చాల ధియేటర్లు స్కెచ్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దినపత్రిక తన కథనంలో పేర్కొంది. 

ఈసినిమాకు మొదటి మూడు రోజుల పాటు కార్పొరేట్ షోల పేరుతో మల్టీప్లెక్స్‌ లలో టికెట్లన్నీ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇందుకోసం మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి ఫుడ్ కూపన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే టికెట్ ధర 150 అయితే కాంబో ఆఫర్ పేరుతో దానిని 250 నుంచి 300 వరకు విక్రయిస్తున్నారు. తద్వారా ఒక్క షో ద్వారానే లక్షలాది రూపాయలు పిండుకుంటున్నారు అన్న వార్తలు వస్తున్నాయి.  

ఇక ఒక్కో టికెట్‌ను 450 పెట్టి కొంటున్న దళారులు వాటిని ఎంట్రీ పాస్‌ ల రూపంలో ప్రింట్ చేస్తున్నారు అన్న సంచలన వార్తలను కూడ ఆ ప్రముఖ దిన పత్రిక తన కథనంలో బయట పెట్టింది. వాటిపై వివిధ సంస్థల ప్రకటనలను ముద్రించి లక్షలాది రూపాయలు గణించే పధకాలు కూడ అమలు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ లో మొదటి మూడు రోజులకు ఒక్క టిక్కెట్ కూడ దొరకని నేపధ్యంలో ‘బాహుబలి 2’ ధియేటర్స్ వద్ద మన ఇరు రాష్ట్రాలలోను భారీ స్థాయిలో బ్లాక్ జరిగే అవకాశం ఉంది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో మన తెలుగు రాష్ట్రాలలో ‘బాహుబలి 2’ మొదటి మూడు రోజులకు టిక్కెట్ ను సంపాదించినవాడు హీరోకే  హీరోగా గుర్తింపు తెచ్చుకునే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: