Image result for keerti suresh images


మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను వెండితెరపైకి ఎక్కించబూనటం ఒక సాహసమే. నాగ్ అశ్విన్ ప్రోజెక్ట్ సరిగా హాండిల్ చేసి విజయవంతమైతే రాజమౌళి కొచ్చినంత కీర్తి వస్తుంది  దక్షిణ భారతంలో.  నటీనటుల ఎంపికలో ఆయన చూపించే సృజనా త్మకత, పరిణితి,  చలన చిత్ర మాధ్యమాల్లో చర్చలు,  రోజురోజుకి సినిమాపై ప్రక్షకులకు విపరీతమైన క్రేజ్ మాత్రమే కాదు హైప్ ను తెస్తున్నాయి.


Image result for keerti suresh images



ఊహాతీతంగా జరుగుతున్న నటీనటుల ఎంపిక మాత్రం ఒక అద్భుత పరిణామానికి దారితీస్తూ,  కొందరికి ఈ తరహా సినిమాలు తీయాలనే ప్రోత్సాహాన్ని పెంచేస్తున్నాయి. "మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ ఆసాంతం, రంగుల మయం, మెరుపుల మయం, మాత్రమేకాదు, అనేక మలుపులతో, ఊహాకాంతులతో, ఆశాసౌధాలతో, మెరుపులతో మరకలతో, అవమానాలతో, ఆరాధనలతో, కొనసాగిన అంతులేని  విషాధగాధ.  


అలాంటి మహానటి చుట్టూ రోజు ఉండే సహచరులు సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లుగా మారనున్న తరుణములో ఆయా పాత్రలు పోషించే న‌టీ న‌టుల ఎంపికే ఒక పెద్దసమస్య. మాత్రమే కాదు సవాల్ కూడా!  అదే పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. నెల‌ల త‌ర‌బ‌డి ఇందుకోసం సమయాన్ని వెచ్చిస్తూ అలుపెరుగని వేట కొనసాగిస్తున్నారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.  దానికి ఆయన ప్రశంసలకు అర్హుడే.  


Image result for dulquar salman images


ఉన్నంతలో నాటి "సావిత్రి పాత్ర‌ ముఖారవిందాన్ని కీర్తి సురేష్ ముఖబింబం" పై చూపించగలిగితే అది పెద్ద విశేషమే.  యస్!  ఆమె ముఖాన్ని- ఈమె ముఖములో ప్రతిబింబించటం సాధ్యమే.  ముఖ కవళికలు అద్భుతంగా చూపించొచ్చు. అనుభూతులను, ఆహార్యాన్ని,  ప్రదర్శించగలిగితే అవి చక్కగా  ప్రకటించబడతాయనటములో సందేహం లేదు. మ‌రో రెండు కీల‌క పాత్ర‌ల‌కు స‌మంత‌.. అనుష్క‌లను ఎంచుకుని ఫైన‌లైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సావిత్ర క‌థ‌లో అతి కీల‌క పాత్ర‌ధారి అయిన జెమిని గ‌ణేశ‌న్ క్యారెక్ట‌ర్ కోసం కొన్ని నెల‌లుగా వేట కొనసాగిస్తున్నరు నాగ్ అశ్విన్. ఇదే అత్యంత కీలక పాత్ర. బహు ముఖ హావ భావాలను ఊసరవెల్లి రంగులను మార్చినట్లు  ఒకే సమయములో విబ్భిన్న నీడలను (షేడ్స్) ఒకేసారి ప్రదర్శించగల  యువనటులకై  పరిశోధనలు పరిశీలనలు  జ‌రుపుతున్నాడట.


ఈ పాత్ర‌కు కొంత కాలం సూర్య అని, మరి కొంత కాలం ప్ర‌కాష్ రాజ్ అని కాలహరణం జరిగింది. ర‌క‌రకాల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. చివరకవన్నీ,  ఆ ప్ర‌చారాల‌న్నీ గాలి కబుర్లే అని తేలిపోయింది. ఎట్ట‌కేల‌కు జెమిని పాత్ర పోషించే న‌టుడెవ‌రో ఖ‌రారైంది.


Image result for dulquar salman images



మ‌మ్ముట్టి త‌న‌యుడు.. "ఓకే బంగారం" సినిమాతో తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాత్రమేకాక తమిళ, కన్నడ, మళయాల సినిమా అభిమానులను ఆక‌ట్టుకున్న దుల్క‌ర్ స‌ల్మాన్. "మ‌హాన‌టి" గా కీర్తి సురేష్ నటిస్తే కొన్ని విలన్ షేడ్స్ ఉన్న జెమిని గ‌ణేశ‌న్ పాత్ర "దుల్కర్ సల్మాన్"  ఈడు జోడుతో పాటు ఆ పాత్రను పోషించ‌గలడని పిస్తుంది. ఈ ఎంపిక ఈ సినిమాకు అత్యంత విజ్ఞత, పరిణితితో తీసుకొన్న నిర్ణయంగా  విశేషంగా చెప్పవచ్చు. "సావిత్రి జెమిని గనేషణ్" లు చూపరులకు "మేడ్ ఫర్ ఈచ్ అదర్" లాగా కూడా ఉండేవాళ్ళు. 


అనేక ర‌కాలుగా ఆలోచించి, విజ్ఞత జోడించి చాలామందిని ప‌రిశీలించి చివ‌రికి దుల్క‌ర్ సలమాన్ ను జెమిని పాత్ర‌కు ఓకే చేయటములోనే ఈ మహానటి సినిమా విజయానికి నాగ్ అశ్విన్ బాటలువేశాడు అని చెప్పొచ్చు. ఈ ఎంపిక అంద‌రి ప్ర‌శంస‌ల్ని మెప్పుని అందుకుంటోంది. కీర్తి సురేష్‌, స‌మంత‌, అనుష్క‌ల‌ను కీల‌క పాత్ర‌ల‌కు తీసుకోవ‌డం తో ఇప్ప‌టికే ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాషాభిమానులకు చేరువకాగా, ఇప్పుడు దుల్క‌ర్ సల్మాన్ ఎంపికతో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది.


Image result for anushka shetty samanta



 ప్రేక్ష‌కుల్నీ ఈ ఎంపిక సినిమా దియేటటర్స్ కు  ఆక‌ర్షించ‌డం రప్పించటం  ఖాయం. మొత్తంగా  "మ‌హాన‌టి"  ని ఏ ఒక్క భాష‌కో ప‌రిమితం కానివ్వ‌కుండా, దక్షిణ భారత చిత్ర మణి మకుటంగా తీర్చి దిద్దటమనేది నాగ్ అశ్విన్ "టేకింగ్"  మాత్రమే చెప్పగలదు.  అశ్విన్ వెండితెరపై  ఎంత సమర్ధవంతంగా తీసురాగలడనేది మాత్రమే ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గా  మార్చటాన్ని నిర్ణయిస్తుంది. 


ఇంతవరకు మహానటి కథ ఎంపిక ఒక సాహసం, నటీనటుల ఎంపిక ఒక అద్భుతం, నటీనటులతో నటింపజేసి అనుకున్న ప్రభావాన్ని/ ఎఫెక్టును  వెండితెర పై ఎంతవరకు పండిస్తాడనేదే జనాల్లో   "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు"  అన్నంత సంశయాన్ని కలిగిస్తుంది. "సాహో...సావిత్రి...సాహో మహానటి అనిపించగలవా అశ్విన్. అలాచేస్తే నీ జన్మ చరితార్ధమే" 


Image result for nag ashwin images

మరింత సమాచారం తెలుసుకోండి: