సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మద్య ప్రేమాయణాలు కామన్ గా కొనసాగుతుంటాయని చదువుతూనే ఉంటాం.  కొంత మంది ప్రేమ సఫలం కావడంతో పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నాయి.  అయితే కొంత మంది మాత్రం మద్యలోనే బ్రేకప్ చేప్పుకొని మరొకరితో ప్రేమాయణాలు నడిపించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.  ఇది బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయినా ఇలాంటివి కామన్ గా జరుగుతున్నాయి.  ఇలాంటివారిలో ధోని చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అందాల కృతి సనన్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.
Related image
ఈ జంట చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దీంతో ఈ జంట గురించే బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా చర్చ సాగుతోంది.  ప్రస్తుతం ఈ జంట క్ల‌బ్బులు, పబ్బులు, కార్లు ఇలా అన్నిచోట్లా ఈ ప్రేమ‌జంట హుషారుగా షికార్లు సాగిస్తోంది.  కాకపోతే ఆ మద్య కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.   త‌ర్వాత‌ మళ్ళీ కలసి పోయారని వార్తలొచ్చాయి. అయితే ఎడ‌బాటుతో కూడిన విర‌హంలో ఇద్ద‌రిమ‌ధ్యా మ‌రింత సాన్నిహిత్యం పెరిగింద‌ని చెబుతున్నారు.  
Image result for sushanth rajput singh lover krutisanan
ఈ ప్రేమికులు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తూ అభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. దీంతో వీరి ప్రేమ ముదిరి విచ్చ‌లివిడిత‌నానికి చేరిపోయింద‌ని చెప్పుకుంటున్నారు. అంతేకాదు  మొన్న‌నే సుశాంత్ సింగ్ ఓ కొత్త కారు కొన్నాడట. ఆ కారులో కృతిసనన్‌ని లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడట. కంటికి కనిపించీ కనిపించకుండా ఉండే అద్దాల్లో వీరిద్దరు ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారట.


మరింత సమాచారం తెలుసుకోండి: