తెలుగు ఇండస్ట్రీలోకి  ‘హ్యాపీడేస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తమన్నా.  తర్వాత టాప్ యంగ్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ‘బాహుబలి ’ చిత్రంలో అవంతిక పాత్రలో దేవకన్యగా కనిపించినా..తర్వాత యుద్దం చేసే ఒక యోధురాలిగా కనిపించింది.  అయితే ఆ సినిమా తర్వాత తమన్నాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.  ఆ మద్య రవితేజ సరసన బెంగాల్ టైగర్ చిత్రంలో నటించింది.  తప్పితే  ఈ అమ్మడు మళ్లీ తెరపై కనిపించలేదు.  ప్రస్తుతం  తమన్నా నటించిన ‘బాహుబలి 2’  ఏప్రిల్ 28 న రాబోతుంది.  
Image result for tamanna bahubali
ఆ మద్య ప్రభుదేవతో అభినేత్రి సినిమా నటించింది.  అయితే తెలుగులో ఖాళీ కానీ తమిళ సినిమాలు అలాగే ప్రభుదేవా పుణ్యమా అని ఓ హిందీ సినిమా మాత్రం ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.  ఇదే విషయం ఈ మిల్కీబ్యూటీ ముందు ప్రస్తావిస్తే తనకు నచ్చిన సినిమాలు ఉంటే చేస్తానని ఏది పడితే అది చేయనని అంటుంది.
Image result for ‘అభినేత్రి’
కాకపోతే ‘అభినేత్రి’ చిత్రం తర్వాత ప్రభుదేవకు ఈ అమ్మడు బాగా కనెక్ట్ అయ్యిందని అంటున్నారు. అందుకే తన తదుపరి చిత్రంలో తమన్నానే హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడని అంటున్నారు ఫిల్మ్ వర్గాలు.  అంతే కాదు ఈ సినిమా తర్వాత ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని తమిళ మీడియా , ముంబై మీడియా కోడై కూస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: