ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మద్య కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది.  గ్లామర్ ఉన్నంత వరకు తమ అందాలతో మెప్పించినా కొంత కాలానికి కొత్త హీరోయిన్ల తాకిడికి సీనియర్లు తట్టుకోలేక పోతున్నారు.  ముఖ్యంగా అందాల ఆరబోత అడ్డాగా మారిని బాలీవుడ్ నుంచి కొంత మంది హీరోయిన్లు వచ్చి బికినీ, లిప్ లాక్ సీన్లు, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లలో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.   ఇక సినీ పరిశ్రమలో అద్భుతమైన నటనను ప్రదర్శించినప్పటికీ మార్కెట్‌ డల్‌ కావడంతో ఇలియానా, రాధికా ఆప్టే, విద్యాబాలన్‌ వంటి భామలు అందాలను ఆరబోసి మార్కెట్‌ను తిరిగి పొందగలిగారు.
టాప్‌ లెస్‌గా నటించడానికి సై
ఇక రాధికా ఆప్టే గురించి  కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు...ఈ అమ్మడు ‘పార్సెట్‌’ వంటి కొన్ని చిత్రాలలో టాప్‌లెస్‌గా నటించి కలకలం రేపుతోంది.  దీనిపై ఈ అమ్మడు కొత్త రకమైన భాష్యం చెప్పింది..నటనకు ప్రాధాన్యం ఉంటే ఎలాంటి పాత్రల్లో అయినా నేను నటించడానికి రెడీ అంటుంది.  తాజాగా ఈ అమ్మడినే ఫాలో అవుతుంది..తమిళ బ్యూటీ సుజా వరూణి.  తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా తెలియకపోయినా ఈ అమ్మడు  తమిళంలో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాలలో నటించింది సుజా వరూణి. వీటిలో చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్‌ సాగ్సే అధికం.

ఎన్ని సినిమాల్లో నటించినా తనకు మంచి ప్రాధాన్యత రాకపోవడంతో ఈ బ్యూటి బ్యూటీ విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్‌లెస్‌గా నటించడానికి తాను సై అంటూ ముందుకు వచ్చింది.  పార్చేడ్ వంటి సినిమాతో ఒక్క సారి దేశవ్యాప్త ఇండస్ట్రీల చూపు తనవైపు తిప్పుకున్న రాధికా లా తానూ ఓ వెలుగు వెలగాలనుకుందో గానీ నేను అలాంటి పాత్రలకు సిద్దం అంటూ చెప్పేసింది సుజా వరూణి. విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు నటించే హీరోయిన్‌ ఓరిటెండెట్‌ చిత్రాల్లో నటించాలని ఆశ అని తెలిపింది.

కథ ప్రాముఖ్యతను బట్టి టాప్‌లెస్‌గా కూడా నటించడానికి తాను సిద్ధమని, అంతటి ధైర్యం తనకు ఉన్నదని తెలిపింది. అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉదని చెప్పింది.  ఇప్పటికైతే ఇరవుక్కు ఆయిరం కన్గల్, శత్రు, ఆన్‌దేవదై వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వరూణి వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: