తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా వచ్చిన వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు.  తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు నట వారసుడిగా ప్రభాస్ ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇదే రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో నటించిన జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  అయితే ప్రభాస్ ఈ రెండు సినిమాల కోసం తన 5 సంవత్సరాల కాలాన్ని వదులుకున్నాడు. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాడు కానీ..ఫ్యాన్స్ కి మాత్రం ఏ కొత్త సినిమా ఇవ్వలేక పోయాడు.
Image result for baahubali 2
 ఇక బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా టైటిల్ ఖారారు చేశారు. 
జీత్ దర్శకత్వంలో 'సాహో' పేరుతో తెరకెక్కుతోందని, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూ. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందన్నారు. ప్రభాస్‌ 19వ సినిమా టైటిల్‌ ‘సాహో’నే. సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న సినిమాకు ‘సాహో’ టైటిల్‌ ఖరారు చేసినట్టు ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది.
ప్రభాస్ రేంజికి తగిన విధంగా
‘భళి భళి భళి రాభళి... సాహోరే బాహుబలి’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. అందులోని ‘సాహో’ను తాజా సినిమాకు టైటిల్‌గా తీసుకున్నారు. ఇదిలా ఉంటే అటు అభిమానులు, సినీ వర్గాలు.... ఇటు సాధారణ ప్రేక్షకులు, మీడియా వర్గాల్లో  ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం టైటిల్ పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాల బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చే చిత్రం కావ‌డంతో అస‌లు ఏ టైటిల్ పెట్టార‌నే క్యూరియాసిటీతో ప్ర‌పంచ‌వ్యాప్త ప్ర‌భాస్ అభిమానులు, భార‌తీయ సినీ ప్రేక్ష‌కులు గూగుల్ లో సెర్చ్ చేయ‌టం విశేషం. వంశి-ప్ర‌మెద్,విక్రమ్ సంయుక్తంగా యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి అనే చిత్రాన్ని నిర్మించారు.
బాహుబలి-ది కంక్లూజన్ తో పాటు సాహో
అప్ప‌టికి రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కెరీర్ బెస్ట్ గ్రాస్ ని అందించారు. కొనసాగింపుగా యువి క్రియేషన్స్ నిర్మించిన ప్ర‌తి చిత్రం ఆయా హీరోల‌కి బెస్ట్ గ్రాస‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ని అందించింది. సినిమా ప‌ట్ల ప్యాషన్ తో స్టోరి జ‌డ్జిమెంట్ తో 100 శాతం స‌క్స‌ెస్ రేట్ సాధించి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా ముందుకు దూసుకుపోతున్నారు. క‌థ ని బేస్ చేసుకుని బ‌డ్జెట్ ని రిచ్ గా ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేస్తూ... చూసిన ఆడియ‌న్ కి ఇది యు.వి వారి చిత్రం అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియోష‌న్స్‌. 

ప్రభాస్  

మరింత సమాచారం తెలుసుకోండి: