యావత్ భారత దేశంలో ఇప్పుుడు ‘బాహుబలి’ మానియా పట్టుకుంది.  ఎక్కడ చూసినా బాహుబలి అన్న పదమే ఎక్కువ వినిపిస్తుంది.  గతంలో బాహబలి కోసం జక్కన్న క్రియేట్ చేసిన మేజిక్ ఇప్పుడు మరోసారి చేస్తున్నారు.  సినిమా ప్రచారానికి సోషల్ మీడియాను ఎంతగా వాడుకున్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పుడు బుల్లితెరపై కూడా బాహుబలి 2 కి సంబంధింన ప్రచారం చేస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు.  అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28 న ‘బాహుబలి 2’ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.  
బాహుబలికి రోజుకు 5 షోలు?
బాహుబలి-2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండంటంతో ఆ సినిమా నిర్మాతలు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు.  వందేళ్ల చరిత్రలో ఒక సినిమా కోసం ఇంతగా ఎవ్వరు ఎదురు చూడలేదన్నారు మంత్రి. ఇది మన సినిమా.. అందరం ప్రమోట్ చేయాలని కోరారు. ఆరు వేల థియోటర్లలో బాహుబలి విడుదల కానున్నదని తెలిపారు. బాహుబలి చిత్ర నిర్మాత, డైరెక్టర్, చిత్ర యూనిట్ కు మంత్రి శుభాకాంక్షలు చెప్పారు.

అయితే, మొదటి 15 రోజుల పాటు అన్ని థియేటర్లలోను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టికెట్లు విక్రయించాలని, బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని బాహుబలి నిర్మాతలకు తెలిపారు. అంతే కాదు  సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల నియంత్రణపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. టికెట్ విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగేలా చూస్తామని తెలిపారు. బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. 



మరింత సమాచారం తెలుసుకోండి: