కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడం పట్ల తెలుగు సినిమా రంగానికి  అందరు తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోని అన్ని వర్గాలు ఈసత్కారం తెలుగు సినిమా రంగానికి వచ్చిన గౌరవంగా భావిస్తున్న నేపధ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయ మై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యానికి  గురి చేస్తున్నా యి. 

'నేను దాదా సాహెబ్‌ ఫాల్కే సినిమాల్ని చూశాను, విశ్వనాథ్‌ గారి సినిమాలు చూశాను, మీ పేరుతో దాదా సాహెబ్‌ ఫాల్కేకి అవార్డు ఇవ్వాలి' అంటూ వర్మ కామెంట్ చేయడం ద్వారా దాదా సాహెబ్‌ ఫాల్కే కంటే విశ్వనాధ్ గొప్పవారు’ అన్న సంకేతాలు ఇచ్చాడు వర్మ. అంతేకాదు విశ్వనాధ్ కు ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డ్‌ రావడం తనను పెద్దగా ఇంప్రెస్‌ చేయలేదు అని అనడం ద్వారా విశ్వనాధ్ కు ఇంకా మరింత గొప్ప అవార్డులు రావాలి అన్న అభిప్రాయం వర్మ మాటలలో వ్యక్తం అవుతోంది.

దీనితో కళాతపస్వి విశ్వనాధ్ ను కూడ వర్మ మనస్పూర్తిగా అభినందించలేడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు దాదాసాహెబ్ లాంటి మహోన్నత వ్యక్తితో మరో గొప్ప వ్యక్తి విశ్వనాధ్ ను పోల్చడం ఎంత వరకు అభిలాషనీయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వర్మ తన మనసులో అనుకున్నది దాచుకోకుండా బయటకు చెప్పడం, నలుగురు నడిచేదారిలో వర్మ నడవక పోవడం ఆయన పద్దతి కాబట్టి వర్మ కామెంట్స్ ను చూసి విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు కూడ సర్దుకుపోవాలి అనుకోవాలి. 

అందుకే వర్మ తనను పుట్టించిన దేముడుకి కూడ తానూ అర్ధంకాను అంటూ ఆమధ్య తన పై తానె సెటైర్లు వేసుకున్నాడు. ఏది ఏమైనా తెలుగు సినిమాఖ్యాతిని తనదైన శైలిలో జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన విశ్వనాధ్ టాలీవుడ్ దర్శకులలో ఒక దర్శక ఋషి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: