బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయిన నాటి నుండి ప్రేక్షకులు మదిలో మెదిలో మొదటి ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. దాదాపు ఈ ప్రశ్న మీద జరిగిన డిస్కషన్స్ అంతా ఇంతా కాదు. సిని ప్రియులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా సరదా సందర్భాల్లో ఇంతకీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినట్టు అని జోకులేసుకున్నారు. 


మరో మూడు రోజుల్లో ఆ ప్రశ్నకు సమాధానం తెలుస్తుండగా ఈ క్రమంలో కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడే ఆ సీక్రెట్ బయటకు వచ్చేసింది. శివగామి ఆజ్ఞలను శిరసా పాటించే కట్టప్ప ఆమె ఆజ్ఞ మేరకే బాహుబలిని చంపాడని అంటున్నారు. అలా ఎందుకంటే భళ్లాలదేవ, బిజ్జల దేవ బాహుబలి మీద వ్యతిరేకంగా శివగామికి చెప్తారట.


ఈ క్రమంలో వారు చెప్పిన విషయాలను నమ్మిన శివగామి కట్టప్ప ద్వారా బాహుబలిని చంపమని ఆదేశిస్తుందట. అందుకే మొదటి పార్ట్ లో తాను చేసిన తప్పులకు తన ప్రాణాలు అడ్డుపెట్టి శివుడిని కాపాడుతుంది. ఇది నిజంగా శివగామి కుట్రేనా లేక మరేంటి.. ఈ ప్రశ్నకు సమాధానం మరో మూడు రోజుల్లో తెలుస్తుంది.  


ఈ సినిమా టికెట్ల కోసం ఇప్పటికే ప్రేక్షకులంతా థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు. ఏపిలో 6, తెలంగాణాలో 5 షోలతో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా రిలీజ్ చేస్తున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: