బాహుబలి మొదటి భాగం లో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న సీన్ లు బోలెడు కనిపిస్తాయి. ప్రధానంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేసం సినిమా మొత్తానికే హై లైట్ గా తీసారు రాజమౌళి. భారీ తనం తో ఆసక్తిగా సాగే ఈ సీన్ దగ్గర ఇంటర్వెల్ పడుతుంది సినిమాకి. ఈ సీన్ లో భల్లాలదేవుడి విగ్రహ ప్రతిష్ట కి రంగం సిద్దం అవ్వడం అదే సమయానికి బాహుబలి వచ్చి అక్కడి జనాల మీద ఆ విగ్రహం పడకుండా కాపాడడం ఇలా జరుగుతుంది వ్యవహారం.


ఫస్ట్ పార్ట్ కంటే సూపర్ గా రెండో పార్ట్ లో చాలా సన్నివేశాలు పెట్టిన రాజమౌళి రెండో భాగం లో కూడా విగ్రహ ప్రతిష్ట సీన్ ఒకటి పెట్టాడట. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్లో జనాలందరూ కళ్లు విచ్చుకుని ఆశ్చర్యంగా చూసే షాట్ ఒకటి గమనించే ఉంటారు. జనం ఆశ్చర్యంగా గాల్లోకి చూస్తూ ఉంటారు ఆ హావ భావాలు అన్నీ విగ్రహం కొలువు దీరిన టైం లోనే అంటున్నారు విశ్లేషకులు.


రెండో సారి కూడా విగ్రహం సీన్ పెట్టిన మౌళి ఈ సారి విగ్రహం సీన్ ని చాలా డిఫరెంట్ గా తీసాడు అంటున్నారు. ది కంక్లూజన్పై అంచనాలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సినిమాలో ఏం తక్కువైనా ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: