Image result for bahubali 2 images



బాహుబలి భారతీయ చలన చిత్ర రంగానికే ఒక కుదుపు. 600 - 700 కోట్ల కలక్షన్ల వద్ద ఊగిసలాడుతున్న భారతీయ సినిమా రంగానికి ముఖ్యంగా బాలీవుడ్ చిత్రపరిశ్రమకే ఈ సినిమాతో రాజమౌళి ఒక ఊపు ఒక కదలిక తెచ్చారు. ఈ సినిమా ద్వారా అద్భుతమైన భారత రాజకీయ సంస్కృతి, సాహసం, సాంప్రదాయాలను చక్కని కధనంతో వెండి తెరపై వెలుగులు చిందిస్తూ 1000 కోట్ల వసూళ్ళ వేటపై దృష్టి పెట్టి తగిన గ్రౌండ్ వర్క్ చేయటం కూడా జరిగింది. 


Image result for bahubali 2 images



దీనికోసం రాజమౌళి:


*ఎక్కువ థియేటర్స్ ఎక్కువ స్క్రీన్స్
*ఎక్కువ షోస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రోజు ఆరు ఆటల ప్రదర్శనకు అనుమతినిచ్చింది. తెలంగాణా ప్రభుత్వం అదేదారిలో నడుస్తుంది 
*పోటీ సినిమాలు విడుదలవ్వని వాతావరణం
*అద్భుతమైన సస్పెన్స్ " కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" రెండు సంవత్సరాల జన నిరీక్షణకు సమాదానం కోసం తహతహ హైప్
*ప్రఖ్యాత నటీనటులతో ప్రింట్ మరియు విజన్ మీడియా ద్వారా ప్రత్యెక చర్చలు
*నటీ నటుల వ్యక్తిగత విషయాలపై అలవాట్లపై ఆశక్తికర చర్చలు 
*ఏనోటవిన్నా బాహుబలి బాహుబలి అని తప్ప మరేమీ ముఖ్యంకాని పరిస్థితి సృష్టించారు రాజమౌళి బృందం.  


Image result for bahubali 2 images  



ఈ నెల 28 అంటే ఈ రోజు ఆ రోజు తీసేస్తే సరిగ్గా రెండు రోజుల వ్యవధిలో బాహుబ‌లి ఫీవ‌ర్ జోరందుకున్న‌ది. "బాహుబలి 2 కన్‌క్లూజ‌న్" కోసం దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు రెడీ అయ్యాయి. భారీ బ‌డ్జెట్ సినిమాను భారీ ఎత్తుననే విడుదల చేస్తున్నారు. దేశ‌ వ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల థియేట‌ర్ల‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ప్ర‌ముఖ "ఆంగ్ల వెబ్‌సైట్" ఒక క‌థ‌నాన్ని రాసింది. బాహుబ‌లి2 - ది కంక్లుజన్ ని ఎంత‌లేద‌న్నా సుమారు ఆరు వేల స్క్రీన్ల‌ పై ప్ర‌ద‌ర్శిస్తా ర‌న్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. 


ఆ సంఖ్య‌ను సుమారు ఏడువేలకు పెంచాల‌న్న ఉద్దేశంతో చిత్ర నిర్మాత‌లు ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. సాధార‌ణంగా బాలీవుడ్ చిత్రాలు దేశ‌వ్యాప్తంగా సుమారు అయిదు వేల స్క్రీన్ల‌ పై ప్ర‌ద‌ర్శించే అవ‌కాశాలున్నాయి. ఇక ద‌క్షిణ భార‌త దేశములో సుమారు మూడు వేల థియేట‌ర్ల‌లో స్థానిక భాషా చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి.  అయితే ఏప్రిల్ 28న బాలీవుడ్ నుంచి ఎటువంటి పెద్ద చిత్రం విడుద‌ల కావ‌డం లేదు.


Image result for bahubali 2 images




అన్నీ సినిమాలు ఈ బాహుబలి ప్రదర్శన అనే "అశ్వమేధయాగం" కు  దారిచ్చాయి. దీంతో బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్ ఒకే ఒక్క  సినిమాగా  ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుదలయ్యే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. అంతేకాదు మొద‌టి రోజు బాహుబ‌లి 2 క‌లె క్ష‌న్లు కూడా దిమ్మ‌తిరిగేలా ఉంటాయ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ ఈ సినిమా క‌నుక సుమారు 6500 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయితే, మొద‌టి రోజు క‌లెక్ష‌న్లే దాదాపు రూ.60 కోట్లు దాటే అవ‌కాశం ఉంటుంది.



Image result for bahubali 2 horse images




అయితే ఏప్రిల్ 28న సెల‌వు దినం కాదు కాబట్టి, ఆ రోజున పూర్తి స్థాయిలో క‌లెక్ష‌న్లు ఉండే అవ‌కాశం లేదు. అయినా కానీ ఎంత లేద‌న్నా సుమారు రూ.50 కోట్ల వ‌సూళ్లు తొలి రోజే జ‌రిగే అవ‌కాశాలున్న‌ట్లు అంచ‌నాలు వేస్తున్నారు. ఒక‌వేళ అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ వ‌సూళ్లు పెరిగినా అందులో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌సరం లేదు. బాహుబ‌లి 2 రెండు సంవత్సరాల ప్రజల నిరీక్షణకు "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?"  అనే  ప్రశ్నకు సమాధానం యివ్వనుంది.  దీంతో అన్ని రకాల రికార్డులు బ్రద్ద‌లవ్వల్సిందే అంటున్నారు సినీ పండితులు. 

మొదటి పదిరోజుల్లోనే 500 కోట్ల రూపాయల కనకవర్షం కురుస్తుందని అంచనా. లెటజ్ సీ! 


Image result for bahubali 2 horse images


"I was about 7 years old when I started reading comics called 'Amar Chitra Katha' that are published in India. They're not about a superhero, but they encompass all the stories of India, the folklore, the mythology, everything. But most of these stories are about Indian historical figures. I was fascinated by the forts, the battles, the kings, I not only used to read those stories but I kept telling those stories to my friends in my own way" 

— Rajamouli, on the inspiration for making Baahubali.


మరింత సమాచారం తెలుసుకోండి: