ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డ్ వచ్చినందులకు ప్రపంచంలోని తెలుగు వారందరూ గర్విస్తూ ఉంటే ఈ పురస్కారం వచ్చిన తరువాత తనను కలిసిన మీడియా వర్గాలతో విశ్వనాథ్ ఈ అవార్డ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఏ ఆర్టిస్ట్ లేదా టెక్నీషియన్ కి అయినా ఇటువంటి అవార్డ్ లభించినప్పుడు జీవిత సాఫల్య పురస్కారంగా భావిస్తూ ఉంటారు.

అయితే విశ్వనాథ మాత్రం తనకు ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించినా తనకు పూర్తి సంతృప్తి లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.  ఇదే సందర్భంలో ఆయన చేసిన కామెంట్స్ వెనుక ఎన్నో అర్ధాలు ఉన్నాయి.

'దర్శకుడిగా సంతృప్తికరమైన ప్రయాణం సాగిందని నేను అనుకోవడం లేదు. నాకే కాదు ఏ కళాకారుడికీ సంతృప్తి ఉండదు. ‘శంకరాభరణం’ తీశా కదా అని ఇక చాలు అనుకోలేం కదా. కళ, సంగీతం, సాహిత్యం వీటన్నిటి గురించి ఎంత చెబితే మాత్రం సరిపోతుంది. అయితే సినిమా కళతో మంచి చెప్పాలని కొందరు అంటారు’ అని అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు విశ్వనాథ్.

సినిమాని వ్యాపారం అని కొందరు వినోదం అని మరి కొందరు భావిస్తున్న నేపధ్యంలో తాను కళా సేవ చేసానని అనుకోవడం లేదని కేవలం సినిమాను ఒక వృత్తిగా అనుకుని సినిమాలు తీసిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకున్నారు విశ్వనాథ్. అయితే తాను తీసిన సినిమాలు విలువలకు దూరంగా తీయలేదు అన్నఅభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఇదే సందర్భంలో విశ్వనాథ్ నేటి తరం దర్శకుల పై చేసిన కామెంట్స్ మరింత ఆశ్చర్య పరిచాయి. 

ఈనాటి తరానికి తాను సలహాలు ఇవ్వలేను అని అంటూ వారు అమాయకులు కాదు అన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుత తరం దర్శకుల స్థితి పై కామెంట్స్ చేస్తూ మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలయితే, ఈ కాలం డైరెక్టర్లకు 50 మంది భర్తలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు విశ్వనాథ. అంతేకాదు ప్రస్థుత పరిస్థుతులలో అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ సినిమా తీయడం అంత సులువైన పని కాదు అని అంటూ విశ్వనాథ్ చేసిన కామెంట్స్ నేటి దర్శకుల అయోమయ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: