‘బాహుబలి 2’ మరొక మూడు రోజులలో విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈసినిమా టిక్కెట్ల లొల్లి మీడియాకు స్పెషల్ న్యూస్ గా మారింది.  ‘బాహుబలి 2’ విడుదలైన మొదటి మూడు రోజులలో ఈసినిమాను చూడాలి అంటే ఒక 2000 నోటు వదులుకోవాలి అన్న స్థాయిలో ఈసినిమా టిక్కెట్ల దందా పై వార్తలు వస్తున్నాయి అంటే ఈసినిమా టిక్కెట్ల వ్యవహారం సినిమా ప్రేమికులకు ఎలా సమస్యగా మారిందో అర్ధం అవుతుంది.

అటువంటి మ్యానియాతో మన తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న ఈ ‘బాహుబలి 2’ పబ్లిసిటీకి కనీసం 25 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో ఒకేసారి విడుదల అవుతున్న ఈసినిమా పబ్లిసిటీకి చేతి నుండి ఒక్క రూపాయి కూడ ఖర్చు అవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనికి కారణం ఈసినిమా పబ్లిసిటీకి సంబంధించి రాజమౌళి అనుసరించిన వ్యూహం అని అంటున్నారు. ‘బాహుబలి 2’ ఏర్పడిన క్రేజ్ తో ఈసినిమాకు చాలామంది మీడియా పార్టనర్స్ గా వచ్చి చేరారు.   తెలుస్తున్న సమాచారం మేరకు  నెస్లే కంపెనీ తన మంచ్‌ చాక్‌లెట్‌ను  ‘బాహుబలి-2’ ప్రచారానికి జోడించి చానల్స్ లో హడావిడి చేస్తోంది.  ఇందుకుగాను, ఆ కంపెనీ బాహుబలి టీమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం విలువ 7కోట్లు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

అలాగే బ్రిటానియా కంపెనీ ‘బాహుబలి 2’ తో కుదుర్చుకున్న ఒప్పందం విలువ నాలుగుకోట్లు అం అంటున్నారు. ఇలాంటి కంపెనీలు ఇంకా చాలానే ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఇచి కాకుండా చాల కార్పొరేటు కంపెనీలు ‘బాహుబలి 2’ నిర్మాతలతో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ సుమారు 50 కోట్ల వరుకు అన్న ప్రచారం కూడా ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుతం ఈ వార్తలు ఇలా హడావిడి చేస్తున్న నేపధ్యంలో రాజమౌళి తెలివిగా తన ‘బాయుబలి 2’ కి కార్పొరేటు సంస్థలు కురిపిస్తున్న కోట్లలోనే కొన్ని కోట్లు ‘బాహుబలి 2’ పబ్లిసిటీకి ఉపయోగిస్తూ ‘బాహుబలి 2’ ప్రమోషన్ ను రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు రాజమౌళి అంటూ సెటైర్లు పడుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: