టాలీవుడ్ లో అఖిల్- శ్రీయ భూపాల్ ల ఎంగేజ్మెంట్ ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ప్రతి ఒక్కరూ అఖిల్-శ్రీయ భూపాల్ ల పెళ్లి గురించే మాట్లాడుకునే వాళ్ళు. అయితే అనూహ్యంగా ఎంగేజ్మెంట్ అయిన తరువాత అఖిల్, శ్రీయ భూపాల్ లు విడిపోవడం సంచలనంగా మారింది. అన్న నాగచైతన్య కంటే ముందే నిశ్చితార్థం చేసుకొని త్వరలో పెళ్ళికి కూడా సిద్దమవుతున్న అఖిల్ కి ఈ విధంగా జరగటం ఎవ్వరూ ఊహించని పరిణామం.


అయితే ఇలా విడిపోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం అనేది ఎవ్వరికీ అర్ధం కాని విషయం. అయితే ఈ వార్తల్లో అస్సలు నమ్మలేని వార్త ఒకటి ఉంది. అఖిల్ నటించిన తొలి చిత్రం విఫలం కావడంతో అతని కెరీర్ పై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. తన రెండవ చిత్రం సక్సెస్ సాధించిన తరవాత పెళ్ళి జరిగితే బావుంటుందని శ్రీయ భూపాల్ ఫ్యామిలీ అభిప్రాయపడ్డారంట.


ఈ విషయంలో మనస్పర్ధలు వచ్చి వివాహానికి ఇది అడ్డుగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీయ భూపాల్ తన వ్యక్తిగత బిజినెస్ లను చూసుకుంటున్నారు. అలాగే తను ఓ ఏన్నారై ని జీవిత భాగస్వామిగా తీసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఆ ఎన్నారై తో శ్రీయ భూపాల్ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.


గతంలో హైదరాబాద్ నెలలో ఒకసారైనా వచ్చే శ్రీయ భూపాల్…ఇప్పుడు హైదరాబాద్ కి రావటం మానేసిందని అంటున్నారు. మొత్తంగా శ్రీయ భూపాల్, అఖిల్ ఇద్దరూ వారి పని వారే చూసుకుంటున్నారు. కానీ పెళ్లి జరగకపోవటానికి ఉన్న అసలైన కారణం మాత్రం బయటకు రావటం లేదు. ఇక బయటకు వినిపించేవన్నీ ఎవరి ఊహాగానాలు వారివి అని అక్కినేని ఫ్యామిలీ అంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: