బాహుబలి సిరీస్ కి ఇంతటి క్రేజ్ రావటం వెనుక ఉన్న అసలైన వ్యక్తి కరణ్ జోహార్. బాహుబలి మూవీని హిందీలో భారీగా రిలీజ్ చేసిన కరణ్ జోహార్ కి దాదాపు 100 కోట్ల రూపాయల లాభం వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అలాగే బాహుబలి2 మూవీని సైతం కరణ్ జోహార్ బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కరణ్ జోహార్ కి వచ్చే లాభాన్ని కొందరు ట్రేడ్ పండిట్స్ లెక్కలు వేశారు.


ఈ లెక్కల విలువ ఎంతో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… బాహుబలి సిరీస్ కారణంగా నిర్మాతలతో పాటు ప్రతి ఒక్కరూ లాభపడ్డారు. అందుకే బాహుబలి2 మూవీపై బిజినెస్ వర్గాల నుండి భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ మూవీ రైట్స్ ని దక్కించుకోవటంలో బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ ఏర్పడింది.


ఇక బాలీవుడ్ నుండి పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు కరణ్ జోహార్ కంటే ఎక్కువ మనీ ఇస్తామని చెప్పినా…చిత్ర నిర్మాతలు బాహుబలి2 హిందీ రైట్స్ ని కరణ్ జోహార్ కి మాత్రమే ఇచ్చాయి. ఎందుకంటే హిందీలో చాలా థియోటర్స్ కరణ్ జోహార్ చేతిలో ఉన్నాయి. అలాగే ప్రమోషన్ స్ట్రాటజీ విషయంలో కరణ్ జోహార్ ది మాస్టర్ మైండ్. బాహుబలి2 వంటి భారీ చిత్రానికి ప్రమోషన్స్ జరగాలంటే అది కరణ్ కి మాత్రమే సాధ్యం. ఇదిలా ఉంటే బాహుబలి2 హిందీ రైట్స్ ని దాదాపు 120 కోట్ల రూపాయలకి చిత్ర నిర్మాతలు అమ్మారని అంటున్నారు.


అయితే ఈ మూవీకి హిందీ మార్కెట్ విలువ 500 కోట్ల రూపాయలు. ఎంత తక్కువగా లెక్కలు వేసుకున్నప్పటికీ.. హిందీ మార్కెట్ కలెక్షన్స్ ఒక్కటే 400 కోట్ల రూపాయలను అవలీలగా కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. దీంతో కరణ్ జోహార్ దాదాపు 300 కోట్ల రూపాయలకి మించి ప్రాఫిక్ట్స్ ఉంటాయని అంటున్నారు. ఒకవేళ సినిమా పరిస్థితి బాగోలేదనే టాక్ బయటకు వచ్చిన కరణ్ కి కనీసం 150 కోట్ల రూపాయల లాభం అయినా ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: