తెలుగు సినిమా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంటుంది అంటే కేవలం ప్రేక్షకులకే కాదు తెలుగు మీడియాకు అదో పెద్ద పండుగే.. ఇది మా సినిమా అని చెప్పుకుని గర్వపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాహుబలి-2 రిలీజ్ అవుతున్న సందర్భంలో రాజమౌళి అండ్ కో తెలుగు మీడియాపై వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.         


బాహుబలి దేశ సినిమాగా ప్రమోట్ చేయబడుతుంది. అయితే బాహుబలి మొదటి పార్ట్ లో కూడా తెలుగు మీడియా మీద కాసింత చిన్న చూపు చూపించారు చిత్రయూనిట్. అయినా సరే అదంత పట్టించుకోకుండా సపోర్ట్ గా నిలిచి సినిమా హిట్ అయ్యేందుకు ముఖ్య పాత్ర పోశించారు.


ఈ క్రమంలో బాహుబలి-2 విషయంలో కూడా ఇదే తప్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం నేషనల్ మీడియా మీదే దృష్టి అంతా పెట్టి తెలుగు మీడియాను చులకన చేస్తున్న భావన కలుగుతుంది. తెలుగు సినిమా సత్తా ప్రపంచ దేశాలకు చాటి చెప్పే క్రమంలో మీడియా కూడా తన పెద్ద గొంతుతో సినిమా ప్రచారంలో భాగమైంది.     


బాహుబలి-2 విషయంలో కూడా ఈలాంటి పొరపాట్లే జరుగుతున్నాయి వాటిని గమనించి ఇక నైనా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. తెలుగు మీడియాపై ఈ వ్యతిరేక దృష్టి కావాలని చేస్తుంది కాకపోయినా మీడియా పెద్ద వారిని ఈ విషయం హర్ట్ చేస్తున్నాయని తెలుస్తుంది.  ఈ విషయంపై రాజమౌళి త్వరగా నిర్ణయం తీసుకుని నష్ట పరిహార పనులపై దృష్టి పెడితే మంచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: