వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళికి ‘అహం’ ఉంది అంటే ఎవరు నమ్మరు. అందరితో నవ్వుతూ కలిసిపోయే రాజమౌళిని టాలీవుడ్ సినిమా రంగంలో అందరు ఇష్ట పడతారు. దీనికితోడు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ వరస విజయాలతో రికార్డులను సృష్టిస్తూ ఉన్నా ఎక్కడా రాజమౌళి ముఖంలో అహం కనిపించదు. 

అటువంటి రాజమౌళి వ్యక్తిత్వం పై రమారాజమౌలి ఈమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.  ఈ ఇంటర్వ్యూను నిర్వహించిన మీడియా ప్రతినిధి రాజమౌళికి గర్వం ఉందా ? అని అడిగిన ప్రశ్నకు రమారాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

"రాజమౌళికి కూడా గర్వం ఉంటుంది. ఆయనేమీ గౌతమ బుద్దుడు కాడు. సెయింట్‌ అసలే కాదు. ఇంత పెద్ద సక్సెస్‌ సాధించిన తర్వాత చిన్నపాటి గర్వం లేకుండా ఎలా ఉంటుంది ? అంటూ రాజమౌళి సక్సెస్‌ చూసి తనకే గర్వంగా అనిపించినప్పుడు రాజమౌళికి గర్వం లేకుండా ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తోంది రమారాజమౌళి. 

ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తాను రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా రిజల్ట్ గురించి తెగ టెన్షన్ పడతాను అని చెపుతూ అటువంటి టెన్సన్స్ ఏమి లేకుండా రాజమౌళి తన సినిమా విడుదలకు ముందురోజు హాయిగా నిద్రపోతాడు అన్న విషయాన్ని బయట పెట్టింది రాజమౌళి భార్య. ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని రాజమౌళి అహం గురించి రమా రాజమౌళి ఆసక్తికర విషయాలను బయట పెట్టడంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: