రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ 7వేల స్క్రీన్స్ లో విడుదల అవుతోంది అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అంటూ బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తలు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ‘బాహుబలి 2’ యూనిట్ చేస్తున్న ప్రచారం ప్రకారం ఈమూవీ ఒక్క తెలుగులోనే 3 వేల స్క్రీన్స్ లో విడుదల అవుతోందని ఇక తమిళ మళయాళ హిందీ వర్షన్స్ కలిపి మరో నాలుగువేల స్క్రీన్స్ లో విడుదల అవుతోంది అంటూ ‘బాహుబలి 2’ నిర్మాతలు ఇస్తున్న లీకులు కేవలం పబ్లిసిటీ డ్రామా అన్న కామెంట్స్ బాలీవుడ్ మీడియా వ్రాస్తోంది.

దీనికి కారణం బాలీవుడ్ మీడియా విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం ఎంత భారీ సినిమా అయినప్పటికీ ఇప్పటి వరకు మన ఇండియాలో 5 వేల స్క్రీన్స్ కు మించి ఏభారీ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు అన్న విషయాన్ని బయట పెడుతూ ఇదంతా ‘బాహుబలి 2’ టీమ్ వ్యూహాత్మక ప్రచారం అంటూ వార్తలు వ్రాస్తోంది బాలీవుడ్ మీడియా. ఇది ఇలా ఉండగా ‘బాహుబలి 2’ చిత్రం కోసం జనం వెర్రిగా ఎదురు చూస్తున్నారు అన్న విషయాన్ని ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ కు జరుగుతున్న హంగామను బట్టి అర్ధం అవుతోంది. 

కేవలం తెలుగువారు ఎక్కువగా ఉండే అమెరికాలోనే మాత్రమే కాకుండా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కూడ ఈసినిమా టిక్కెట్లకు వచ్చిన క్రేజ్ హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8' కంటే చాలా ఎక్కువగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. కేవలం ఒక్క గల్ఫ్ దేశాలలోనే ఈ మూవీకి మొదటి రోజు 5 కోట్ల కలక్షన్స్ ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడు పోతు ఉండటంతో మన తెలుగుకి సంబంధించి ఈసినిమా మొదటి రోజు కలక్షన్స్ 40 కోట్ల వరకు ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మన ఇరు రాష్ట్రాలలోని ప్రతి ఊళ్లో వున్న అన్ని థియేటర్లలో అన్ని ధియేటర్లలో ‘బాహుబలి 2’ సినిమా విడుదలవుతున్నా చూడాలనుకున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో మొదటి 3 రోజులకు ఈసినిమా టిక్కెట్స్ దొరకడం సామాన్యులకు సాధ్యం కాని పనిగా మారిపోయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: