‘బాహుబలి 2’ విడుదల రోజున ధియేటర్ల ముందు జరిగే హంగామా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ ఉంటే ఏకంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ‘బాహుబలి 2’ విడుదల అవుతున్న ఏప్రియల్ 28న తమ షూటింగ్స్ కు కూడ సెలవు ప్రకటించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత సంవత్సరం ‘కబాలి' సినిమా కోసం తమిళనాడులో కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇదే తీరు మన తెలుగు రాష్ట్రాలలోను కనిపించడంతో పాటు సినీ పరిశ్రమలో మాత్రం 'బాహుబలి సెలవు' అంశం అనేక చర్చలకు దారి తీస్తోంది. మంచు మనోజ్‌ హీరోగా 'ఒక్కడు మిగిలాడు' సినిమా షూటింగ్ కు ‘బాహుబలి 2’ విడుదల రోజున ఆసినిమా చూడటం కోసం విరామం ఇస్తున్నట్లుగా తమకు ఈసినిమా దర్శకుడు సెలవు ఇచ్చాడు అంటూ మంచు మనోజ్ తన ట్విటర్ లో వెల్లడించాడు.

వినడానికి ఈమాటలు మరీ అతిగా అనిపిస్తున్నా ‘బాహుబలి 2’ మ్యానియా ఏస్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోందో అందరికీ అర్ధం అయ్యేలా ఉంది. ఈమూవీకి వస్తున్న ఖ్యాతిని సొంతం చేసుకోవడం కోసం ఈ మూవీకి మద్దతు పలుకుతూ చిన్న హీరోలు అంతా తాము కూడా ‘బాహుబలి 2’ లో భాగమే అన్న భావనతో కలలు కంటూ ఇలా షూటింగ్ లకు డుమ్మా కొడుతున్నారను  కోవాలి.

'కబాలి' కోసం తమిళనాడులోని కొన్ని కార్పొరేట్‌ సంస్థలు సెలవు ప్రకటించినప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్' కోసం టాలీవుడ్‌లో సెలవు ప్రకటిస్తే తప్పు ఏమిటి అంటూ కొందరు యంగ్ హీరోలు చేస్తున్న కామెంట్స్ మరీ అతిగా ఉన్నాయి అంటూ విమర్శలు కూడ వస్తున్నాయి. 1000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ గా విడుదల అవుతున్న ఈసినిమా మ్యానియాను చూసి బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ అమీర్ షారుఖ్ ఖాన్స్ తమ మధ్య ఉన్న విభేదాలు విస్మరించి ఒకడిన్నర్ పార్టీ పెట్టుకుని ఈ ముగ్గురు టాప్ హీరోలు ‘బాహుబలి 2’ మ్యానియా గురించి చర్చించారు అని వార్తలు వస్తున్న నేపధ్యాన్ని చూస్తూ ఉంటే ‘బాహుబలి 2’ పై బాలీవుడ్ లో ఏ స్థాయిలో అసూయపడుతున్నారో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: