శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ సూపర్ సక్సస్స్ తరువాత అప్పటి యంగ్ హీరో రాజా టాప్ యంగ్ హీరోల లిస్టులో చేరిపోతాడు అని అనుకున్నారు అంతా. అయితే ఆతరువాత ఏర్పడిన పోటీ వాతావరణంలో రాజా నిలదోక్కుకోలేకపోయాడు. దీనితో సినిమాలకు దూరం అయిన రాజా క్రైస్తవ మత ప్రచారకుడిగా మారి అందరికి షాక్ ఇచ్చాడు. ఈపరిస్థితులలో ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ గురించి అదేవిధంగా కొంతమంది హీరోల గురించి ముఖ్యంగా టాప్ హీరోలు పవన్ మహేష్ లు గురంచి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు. 

తన దృష్టిలో మతం అనేది వ్యక్తిగత నమ్మకం అని అంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికి ప్రేమను పంచడంకోసం మత బోధనలు చేస్తున్నాను అని అంటున్నాడు. ఇదే సందర్భంలో మానవత్వం మించిన మతం ఏదీలేదని అంటూ హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్‌పై  కామెంట్స్ చేసాడు. అప్పట్లో సమస్యలతో బాధపడుతున్న ఉదయ్‌ కిరణ్ ను కలుసుకోవాలని చాలాసార్లు అనుకొన్న విషయాని బయట పెడుతూ ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్‌లో బెడ్ మీద  ఉదయ కిరణ్ శవాన్ని చూసి బాధపడిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు ‘ఉదయ్ కిరణ్ చాలా పిచ్చివాడు' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టి మరో సంచలనం చేసాడు. 

ఇదే సందర్భంలో మహేష్ గురించి మాట్లాడుతూ తన పనేంటో తాను చూసుకోవడం మహేశ్‌ బాబు తత్వం అని అంటూ ఫెయిల్యూర్స్‌ ను అధిగమించి కుటుంబ భారాన్ని మీద వేసుకొని విజయంసాధించిన టాప్ హీరో మహేష్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘బంగారం’ సినిమా సమయంలో పవన్ కల్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి గుర్తుకు చేసుకుంటూ అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు.  

పవన్ కల్యాణ్ అమాయకుడు, చాలా మేధావి అని అంటూ ఎవరైనా తనకు నచ్చితే వారిని గుండెల్లో పెట్టుకొంటాడు, నచ్చకపోతే దూరం పెడుతాడు అంటూ రాజా పవన్ పై చేసిన కామెంట్స్ మరింత సంచలం గా మరాయి.  అంతేకాదు గత ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్‌ పై విమర్శలు చేయడం తనతప్పు అని ఆలస్యంగా తెలుసుకున్నాను అని అంటున్నాడు రాజ. 

ఇదే సందర్భంలో తనకు ‘ఆనంద్’ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలో తనకు అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ముల పై కామెంట్స్ చేస్తూ ఫిలిం మేకింగ్‌లో ఆయన డిఫరెంట్ అని చెపుతూ ‘గోదావరి’ సినిమాలో తనకు అవకాశం ఇచ్చినా తానూ ఉపయోగించులేకపోయిన విషయాన్ని బయట పెట్టాడు.  ప్రస్తుతం క్రిస్టియన్ మిషనరీస్‌ తో కలిసిపనిచేస్తు సినిమా రంగానికి దూరంగా ఉన్న రాజ ఇప్పుడు తన సినిమారంగ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: