తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి మానియా పట్టుకుంది.  ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని చూడటానికి ఎంతో మంది అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.  దీనికి కారణం మొదటి పార్ట్ లో బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన మామగా పిలుచుకునే కట్టప్ప వెన్నుపోటు పోడవంపై రక రకాల అనుమానాలు..ఆసక్తి ఏర్పడింది.  అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని ఇప్పుడు బాహుబలి 2 లో చూడవచ్చు.  దీంతో ప్రధాని దగ్గర నుంచి సామాన్య పౌరుడి వరకు ఈ చిత్రం చూడాలన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది.  
Baahubali 2 The Conclusion Movie Latest Working Stills & Posters
అయితే ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గౌరవాన్ని పెంచారు దర్శకధీరుడు రాజమౌళి.  అంతే కాదు ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా మరో ప్రత్యేకత.  భారత దేశ వ్యాప్తంగా మంచి దర్శకుడిగా గుర్తించబడ్డ రాజమౌళిని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెగ పొగిడేస్తున్నాడు.  తాజాగా డైరెక్టర్ రాజమౌళి గురించి ఓ ట్వీట్‌ చేశాడు.
Baahubali 2 The Conclusion Movie Latest Working Stills & Posters
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి.. దేశంలోని మిగతా దర్శకులందరు టీవీ సీరియల్‌ డైరెక్టర్లుగా ఫీల్‌ అయ్యేలా చేసిందంటూ ఒపీనియన్‌ని వ్యక్తంచేశాడు. రీసెంట్ గా గతంలో వీరిద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో పిక్ చేసి అగ్లీ అండ్ బ్యూటీఫుల్ అని పోస్ట్ చేశాడు.  ఇప్పుడు జక్కన్నను తెగ పొగిడేస్తూ మిగతా దర్శకులందరినీ కించపరుస్తూ చేసిన పోస్ట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Image result for ram gopal varma rajamouli
ఆ మద్య వర్మ చేసిన పోస్ట్ కి స్పందించిన రాజమౌళి, అయ్యా నన్ను వదిలేయండి అంటూ రిప్లై ఇచ్చిన విషయం తెల్సిందే! ఇక బాహుబలి 2 సినిమాకి వస్తే, సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి ది క‌న్‌క్లూజ‌న్‌ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వర్మ ట్విట్ :



మరింత సమాచారం తెలుసుకోండి: