ఇప్పటి వరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటున్న బాలీవుడ్ కి కోలుకోలేని దెబ్బని కొట్టింది బాహుబలి2. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…బాహుబలి2 ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మోషన్ పిక్ఛర్ గా రిలీజ్ అవుతుంది.


ఇప్పటి వరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు రికార్డ్ లను క్రియేట్ చేసిన బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ… బాహుబలి2 ముందు ఒక్కసారిగా చిన్నబోయింది. ప్రతి ఒక్కరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు కథకి ఇంటర్నేషనల్ లెవల్ లో వస్తున్న ఆధరణ చూస్తుంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మూగబోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే పలు మూవీలకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి.


అయితే బాలీవుడ్ స్టార్స్ ఎక్కడ కనిపించినా..ఇప్పుడు వారిని బాహుబలి2వెంటాడుతుంది. మీడియా బాహుబలి2 కి సంబంధించిన ప్రశ్నలతో బాలీవుడ్ స్టార్స్ కి విసుగును తెప్పించేలా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే బాహుబలి2 మాత్రమే మూవీనా…మేం చేసేవి మూవీలు కాదా? మా మూవీలు గురించి అడగరా? అంటూ కొంత మంది బాలీవుడ్ స్టార్స్ మీడియాపై ఫైర్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొత్తంగా బాహుబలి2 కారణంగా బిటౌన్ చిన్నబోయిందని చెప్పవచ్చు.


బాలీవుడ్ చరిత్రలోనే ఇలా జరగటం మొదటిసారి అంటున్నారు. ఓ రీజనల్ ఫిల్మ్ దెబ్బకి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి రావటంతో నిజంగా రాబోయో రోజులు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలవే అని చెప్పవచ్చు. ఇక సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలోనే బాహుబలి2 కి విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ లో బాహుబలి2థియోట్రికల్ ట్రైలర్ ని చూసింది ఎక్కువుగా నార్త్ ఇండియన్ వారే అని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: