‘బాహుబలి- 2’ మ్యానియా తారాస్థాయికి చేరినా ఈసినిమాను కనీవినీ ఎరుగని రేట్లకు మన ఇరు రాష్ట్రాలలోను కొనుక్కున్న బయ్యర్లు ఏ మాత్రం  సంతోషంగా లేరు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాకు జరిగిన ఊహించని బిజినెస్. మన ఇరు రాష్ట్రాలలోను ఈసినిమాను 130 కోట్ల మొత్తానికి ఏరియాల వారిగా అమ్మేసారు అన్న వార్తలు ఉన్నాయి. 

ఈసినిమా నిస్సందేహంగా విజువల్ వండర్ గా వుంటుంది అన్న విషయంలో ఎటువంటి అనుమానాలు లేకపోయినా విపరీతమైన హైక్ తో విడుదల అవుతున్న ఈసినిమా ఏమేరకు వసూళ్లు సాధిస్తుంది అన్న భయం లోలోపల ఈసినిమా బయ్యర్లకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ‘బాహుబలి 2’ ను కొనుక్కున్న బయ్యర్లు అందరూ లాభపడాలి అంటే  మన తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీ 160 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ రాబట్టాలి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

అయితే ‘బాహుబలి 2’ కు ఈ రేంజ్ లో కలక్షన్స్ రావాలి అంటే ‘బాహుబలి’ వన్ కు మించిన అఖండ విజయం సాధించాలి. ఇలా జరగాలి అంటే, గడచిన పదేళ్లుగా సినిమా అన్నదే చూడని వారు, డెభై ఏళ్లు దాటిన వారు ఇలా అందరూ బాహుబలి వన్ కి మించి రెట్టింపుగా బాహుబలి 2 ను చూస్తేకాని ఈమూవీకి 160 కోట్ల నెట్ కలక్షన్స్ రావు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే ప్రస్తుతం ‘బాహుబలి 2’ ఉన్న వేడి ఒకవారం రోజులు దాటాక చల్లారిపోతుందని అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఈ పరిస్థితే ఎదురైతే ‘బాహుబలి 2’ ప్రేక్షకుల సంఖ్య తగ్గి  ఈసినిమాను నమ్మికోనుక్కున్న చిన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోతారు అన్న కామెంట్స్ కామెంట్స్ కూడ ఉన్నాయి.

అయితే బయ్యర్లులోని ఒక వర్గం మాత్రం టికెట్ 100 రూపాయిలు చూసుకున్నా 150 కోట్లు తొలి మూడు రోజుల్లో వస్తాయి అంటూ పగటి కలల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికితోడు 60 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం మందికి బాహుబలి వన్ నచ్చలేదు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా మండిపోతున్న ఈ ఎండలను కూడ లెక్క చేయకుండా ‘బాహుబలి 2’ రెండవ వారంలో కూడ ఎంతమంది ఇదే మ్యానియాతో ‘బాహుబలి 2’ ధియేటర్ల వైపు వస్తారు అన్న విషయం పై ఈసినిమాకు వచ్చే భారీ సాధించే కలక్షన్స్ ఆధారపడి ఉంటుంది అన్న విశ్లేషణలు కొందరు తెర పైకి తీసుకువస్తున్నారు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: