సంబంధిత చిత్రం



బాహుబలి జక్కన గారు అనుష్క గురించి ప్రవచించింది యదార్ధమేనా?  ఐతే నటన పరంగా నేను ఆమెకు "గొప్ప రేటింగ్ ఏమీ ఇవ్వను"  ఆ విషయంలో ఆమె మీద నాకు మరీ ఎక్కువ అంచనాలేమీ లేవు. అని అన్నట్లు తెలుస్తుంది. నటన పరంగా ఆమె నటనకు గీటురాళ్ళు అరుందతి, వెదం, బాహుబలి, ది బిగినింగ్.




"అనుష్కలో ప్రొఫెషనలిజం నాకు ఎంతో నచ్చే విషయం.

ఆమెకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు.

ఏ సినిమా కోసం ఎంత కష్టపడాలో తెలుసు.

తన పనిని ఎంత బాధ్యత తో చేయాలో తెలుసు.

తన వల్ల కానిది కూడా చేయాలని తపిస్తుంది.

కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటుంది.

ఏం చేయాలో చెప్పండి! చేస్తా! అంటుంది.

ఆమె మంచి మనిషి.


ఇక ఆమె ఆహార్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి రూపం ఇంకెవరికీ లేదు. రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. అందుకే దేవసేన పాత్రకు ఆమె తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు.


సంబంధిత చిత్రం



ఐతే నటన పరంగా నేను ఆమెకు "గొప్ప రేటింగ్ ఏమీ ఇవ్వను"  ఆ విషయంలో ఆమె మీద నాకు మరీ ఎక్కువ అంచనాలు ఉండేవికావు.  ఐతే "బాహుబలి: ది కంక్లూజన్" లో  ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అవతల రమ్యకృష్ణ లాంటి గొప్ప నటిమణి తో ఎదురు నిలబడి నటించి మెప్పించింది. ఇంకా సత్యరాజ్, నాజర్, రానా, ప్రభాస్, ఇలాంటి వాళ్ల ముందు ఆత్మ విశ్వాసం తో నటించడం చూసి ఆశ్చర్యపోయాను’’ అని రాజమౌళి అన్నాడు.

 

"అరుంధతి, రుద్రమదేవి" లాంటి సినిమాల్లో చాలా బాగా నటించి మెప్పించింది అనుష్క. ఈ పాత్రలకు తెలుగు హీరోయిన్లలో ఇంకెవరినీ ఊహించుకోలేం. "బాహుబలి" లో దేవసేన పాత్రలోనూ తన ప్రత్యేకత చాటుకుంది అనుష్క. 


rajamauli anushka hd images కోసం చిత్ర ఫలితం


అయినప్పటికీ అనుష్క అంత గొప్ప నటి అని తాను భావించనని మొహమాటం లేకుండా చెప్పాడు రాజమౌళి. అనుష్కలో నటన కంటే కూడా వేరే అంశాలు తనను ఎక్కువ ఆకట్టుకుంటాయని, నటన విషయంలో ఆమె నుంచి అంత ఎక్కు వేమీ ఆశించనని, ఐతే "బాహుబలి: ది కంక్లూజన్"  వరకు అనుష్క తాను ఆశించిన దాని కంటే బాగానే చేసిందని రాజమౌళి చెప్పాడు.


hard work quotes images కోసం చిత్ర ఫలితం


అద్బుతంగా నటించి తనను ఆశ్చర్యచకితుణ్ణి చేసిందని ఒక దిగ్ధర్శకుని మెప్పు పొందటం అనేది కూడా ఒక అద్భుతమే. ఒకనాడు నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ లాంటివాళ్ళు వీళ్ళేం నటులురా! బాబూ! అనిపించుకున్న వాళ్ళే. తరువాతనే అత్యుత్తమ నటులుగా ఎదిగిపోయారు.  


 తెలుగు సినిమాల్లో యువరాణుల పాత్రలకు జమున, రాజశ్రీ,, జయలలిత, జయప్రద, కాంచన, బి సరోజ, కృష్ణకుమారి వంటివారు పౌరాణిక, జానపద చిత్రాల్లో రాణులుగా, యువరాణులుగా, తమ ఆంగికం, అబినయం, వాచకం, ఆహార్యం తో ప్రేక్షకుల మనసు దోచుకోవటమేకాదు హృదయాల్లో నిలిచిపోయారు. తరవాత కాలములో అలా మెరిసి మురిపించిన కథానాయికలు లేరనే చెప్పాలి.


hard work quotes images కోసం చిత్ర ఫలితం


మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు తెలుగులోనే కాదు. దక్షిణాదిలోనే కాదు. యావద్బారత చిత్ర పరిశ్రమ లోనే యువరాణి, రేరాణి, రాణి, సామ్రాజ్ఞి అంటే మన దేవసేన అనుష్క అనే చెప్పక తప్పదు.   అరుంధతి నుంచి మొదలుకుని -పంచాక్షరి (అమ్మవారుగా), రుద్రమదేవి, క్రిష్ణమ్మ, (భక్తురాలుగా) బాహుబలి, భాగమతి వరకు ప్రాచీన మధ్యయుగాల మహారాణుల పాత్రలకు జీవం పోస్తున్న ఏకైక నటి అనుష్క.


hard work quotes images కోసం చిత్ర ఫలితం


ఈమధ్యే బాహుబలి 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నయ్‌లో జరిగితే ఆ కార్యక్రమానికి హాజరైన నందనం లోని వైఎంసీఎ స్టేడియంలో పాల్గొన్న వేలాదిమంది ప్రేక్షకుల మతులుపోగొట్టారు. స్టేజిమీద యాంకర్ అయితే ప్రశంసలమీద ప్రశంసలు మిమ్మల్ని చూడటానికే 75 వేలమంది ప్రేక్షకులు ఇవ్వాళ ఫంక్షన్ కోసం వచ్చారని పొగడ్తలు. కార్యక్రమం ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల చూపులన్నీ ఆమె పైనే. హుందాతనం, అణకువ, నమ్రత, వివాదాలకు ఇసుమంతయినా తావియ్య కుండా ఒక్కరిని కూడా నెగటివ్‌ గా కామెంట్ చేయకుండా పదేళ్లు చిత్రసీమలో గడిపిన అనుష్క  ప్రేక్షకుల అభిమానాన్ని అందు కుంటు న్న తారల్లో అగ్రగామిగా ఉంటున్నారు. 



hard work quotes images కోసం చిత్ర ఫలితం



అయితే ఇంతటి గుర్తింపు, ప్రాభవం ఆమెకు ఆయాచితంగా లభించలేదు. ఆదిలో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆనుష్క తర్వాత నటనకు ప్రాదాన్యత ఇవ్వడం మొదలెట్టారు. పాత్రకు తగ్గట్టు అభినయించడమే కాదు, అందుకు తగ్గట్టుగా తనను మలచుకోవడానికి శ్రమించే నటి అనుష్క.అందుకే అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఇక అరుంధతి చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలివంటి చిత్రాల్లో పాత్రల్లో పరకాయ ప్రవేశంచేశారు. 

 

ప్రస్తుతం బాహుబలి– 2లో మరోసారి బ్యూటీ నట విజృంభణను చూడబోతున్నాం. అదే విధంగా మధ్యలో ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్‌) చిత్త్రం కోసం సుమారు 90 కిలోల బరువును పెంచుకుని నటించారు. అంత సాహసం మరో నటి చేస్తుందని చెప్పలేం.


అదే విధంగా నటిగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అనుష్క వేదం చిత్రంలో వేశ్యగా నటించారు. ఆ సమయంలో ఆ పాత్రను పోషించవద్దని, ఇమేజ్‌ కు దెబ్బ కొడుతుందని  చాలా మంది సలహా లిచ్చారట భయపెట్టారట.అయినా పాత్ర మీద నమ్మకంతో ధైర్యంగా నటించారు. ఆ పాత్ర తన ఇమేజ్‌ను ఏ మాత్రం డ్యామేజ్‌ చేయలేదని చెన్నైలో మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో అనుష్క పేర్కొన్నారు.  


rajamauli anushka hd images కోసం చిత్ర ఫలితం


“ఎవరి ధైహిక చలనాలే ఈ భువనమో! (ఆంగికం భువనం యశ్య)

ఎవరి పలుకులో ఈ విశ్వభాషో!(వాచికం సర్వ వాజ్మయం) 

ఎవరి అభరణాలు చంద్రులో, తారలో!(ఆహార్యం చంద్ర తార్యాది)

వారే శివుడు వారినే మేము పూజిస్తాం!(తం నమః సాత్వికం శివం)”


అనే శ్లోకాంశాలకు ప్రతీకగా నిలబడ్ద అనుష్కది 99% కృషి 1% ఇన్స్పిరేషన్ ప్రేరణ, ఆసక్తి, శ్వాస అనిచెప్పవచ్చు. శివుడు తన్మయ స్వరూపములో ఉన్న విధి నిర్వాహణే. రాజమౌళి మాటల్నిబట్టి అనుష్క అది సాధించిందనే చెప్పాలి.    

 

 hard work quotes images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: