గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతుంటే…పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకి సంబంధించిన హీరోలు వారి మూవీల షూటింగ్ లను కాన్సిల్ చేసుకొని మరీ ఆ స్టార్ హీరోల సినిమాలను చూడటానికి వెళ్ళేవాళ్ళు. 'కబాలి' సినిమా కోసం తమిళనాడులో కొన్ని సాఫ్ట్‌ వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.


అలాగే కబాలి కోసం కోలీవుడ్ చిత్ర పరిశ్రమ పలు షూటింగ్ లను రద్దు చేసుకుంది. కమల్ హాసన్ నటించిన దశావతారం, విశ్వరూపం సమయంలోనూ ఇటువంటి పరిస్థితే ఎదురయింది. ఆ తరువాత మళ్ళీ ఓ తెలుగు సినిమాని ఈ వైభవం రావటం నిజంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించే సమయం ఇది అని అంటున్నారు. మరో ఒక్క రోజులో బాహుబలి2 మూవీ రిలీజ్ అవుతుంది.


ఈ మూవీ కోసం ఒక్క సౌత్ ఇండియన్ లోని అన్ని రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలే కాకుండా, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు మూవీలు సైతం షూటింగ్ షెడ్యూల్స్ ని ఒక్కరోజు పాటు పోస్ట్ పోన్ చేస్తుకున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు బాహుబలి2 మూవీని చూడాలని తెగ ఆసక్తి చూపుతున్నారు. అందుకే వీరు బాహుబలి2 మూవీని మొదటి చూసేందుకు షూటింగ్ కి బ్రేక్ చెప్పి మరీ థియోటర్స్ కి వెళుతున్నారు. ఇక తెలుగులో ఈ క్రేజ్ ఎక్కువుగా కనిపిస్తుంది.


పలు కార్పోరేట్ సంస్థలు వీకెండ్ షోల కోసం పలు థియోటర్స్ లో కనీసం 300 టికెట్స్ ని బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో బాహుబలి2 మూవీకి వీకెండ్స్ లో టికెట్స్ దొరకటం అనేది అసాధ్యం అని అంటున్నారు. కార్పోరేట్ కంపెనీలు టికెట్ పై డబుల్ పేమంట్ ఇచ్చిమరీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నాయి. దీని కారణంగా సామాన్యులకి వీకెండ్సె లో టికెట్స్ దొరకవు అని అంటున్నారు. ఇక ఇప్పటికే మంచు మనోజ్‌ హీరోగా వస్తున్న 'ఒక్కడు మిగిలాడు' సినిమాకి బాహుబలి2 రిలీజ్ రోజున బ్రేక్ చెప్పారు. 'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదల రోజున ఆ సినిమా చూసేందుకు వీలుగా దర్శకుడు తమకు సెలవు ఇచ్చాడంటూ మంచు మనోజ్‌ ఇప్పటికే ట్విట్టర్‌లో వెల్లడించటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. .



మరింత సమాచారం తెలుసుకోండి: