బాహుబలి2 మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కానీ ఓ కంపెనీ మాత్రం ఆ సినిమా పేరు చెప్పుకొని లాభాలను చూస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించిన బాహుబలి సినిమా ఇప్పుడు రెండో పార్ట్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దాదాపు 8 వేలకి మించిన సిల్వర్ స్క్రీన్లలో బాహుబలి2 ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.


ఇదిలా ఉంటే బాహుబలి2 కారణంగా స్టాక్ మార్కెట్ లో ఉన్న మల్టీప్లెక్స్ కంపెనీలకి వారి షేర్ వాల్యూ కాస్త పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే మల్టిఫ్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ కు భలే గిరాకీ వచ్చిందని అంటున్నారు. బీఎస్ఈలో పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ 2.60 శాతం మేర లాభపడుతూ 1614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.


ఇప్పటికే ఈ కంపెనీ స్టాక్ 41.17 శాతం పెరిగింది. ఇటీవలే బాహుబలి 2విడుదల సందర్భంగా సిల్వర్ స్క్రీన్ల పైకి వచ్చిన బాహుబలి 1కు మంచి స్పందనే వచ్చింది. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్  ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. అయితే పివిఆర్ లో బాహుబలి2కి సంబంధించిన రిలీజ్ నాటి నుండి మొదటి మూడు రోజులు అన్నీ స్క్రీన్స్ లో బాహుబలి2 ఉంటుందని అంటున్నారు.


దీని కారణంగా పివిఆర్ కి ఇది స్టాక్స్ లోనూ షేర్ వాల్యూని పెంచే విధంగా ఉంటుందని అంటున్నారు. అయితే బాహుబలి2 ట్రెండ్ దాదాపు నెల రోజుల నుండి ఓ ఊపు ఊపుతుంది కాబట్టి….పివిఆర్ కి దాదాపు 50 కోట్ల రూపాయల మేర ఇది ఇండైరెక్ట్ గా స్టాక్స్ లో లాభాన్ని తెచ్చిపెట్టిందని అంటున్నారు. మొత్తంగా బాహుబలి2 బిజినెస్ పలు రంగాల సంస్థలపై లాభాదాయకమైన బిజినెస్ తెస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: