తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఘనంగా రిలీజ్ అవుతున్న మూవీ బాహుబలి2. బాహుబలి2 మూవీ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మూవీ అయినప్పటికీ…దీని క్రేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రతి ఒక్కరూ బాహుబలి2 మూవీకి అభిమానిగా మారారు. దీంతో బాహుబలి2 మూవీని చూడటానికి ప్రపంచంలోని సినీ ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు.


ఇదిలా ఉంటే ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు బాహుబలి2 పై ఉన్న క్రేజ్ ని ఇప్పటికే సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? అనే విషయంపై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం. బాహుబలి2 క్రేజ్ పై పబ్లిక్ లో భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. పలు మీడియా సంస్థలు తీసుకున్న పబ్లిక్ పోల్స్ లో బాహుబలి2 పై ప్రేక్షకులు భిన్నమైన కామెంట్స్ చేశారు.


కొందరు బాహుబలి2 మూవీని చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నామని చెప్పగా…కొందరు మాత్రం బాహుబలి2 మూవీని చూడలేకపోతున్నాం….టికెట్స్ దొరకటం లేదు అంటూ నిరుత్సాహపడుతున్నారు. ఇక బాహుబలి2 మూవీలో ప్రతి ఒక్కరికీ కావాల్సిన క్లారిఫికేషన్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అయితే ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన క్లారిఫికేషన్ ని రాజమౌళి రీజనబుల్ గా చూపించాలని చాలా మంది కోరుకుంటున్నారు.


అలా రీజనబుల్ గా లేకపోతే రెండు సంవత్సరాల నుండి వెంటాడుతున్న ఈ ప్రశ్నకి అర్ధం లేకుండా పోతుందని అంటున్నారు. అంతే కాకుండా ఇది సినిమా రిజల్ట్ పై ప్రభావితం చూసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మొత్తంగా బాహుబలి2 మూవీపై పబ్లిక్ టాక్స్ పూర్తి పాజిటివ్ లో ఉండగా…కట్టప్ప విషయంలో  మాత్రం తేడా జరిగితే ఒప్పుకునేది లేదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: