బాహుబలి2 మూవీ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీని మొదటి రోజే చూడాలనేది ప్రతి ప్రేక్షకుడి ఆలోచన. చాలా మంది ముందుగానే ఆలోచింది అడ్వాన్స్ బుకింగ్ ని ఉపయోగించుకున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ లు ఓపెన్ అయిన కొద్ది నిముషాలకే హౌస్ ఫుల్ అయ్యాయి.


ఇక థియోటర్స్ లో బల్క్ బుకింగ్ లు ఉండటంతో మొదటి రోజు అన్ని ఆటలు హౌస్ ఫుల్ అనే బోర్డులు ఉంటున్నాయి. అయితే ఇవేమి పట్టించుకోని ప్రేక్షకులు థియోటర్స్ వద్ద లైన్లో నిలబడి ఎలాగైనా టికెట్స్ ని సాధించుకోవాలనే పట్టుదలతో ఉంటారు. అలాగే చాలా మంది ప్రేక్షకులు థియోటర్స్ వద్దకు వచ్చి టికెట్స్ కోసం ట్రయల్స్ వేస్తుంటారు.


అయితే ట్రేడ్ పండిట్స్ లెక్కల ప్రకారం…బాహుబలి2కి ఉన్న క్రేజ్ కారణంగా థియోటర్స్ వద్దకు వచ్చే ప్రేక్షకులు ఎక్కువుగా ఉంటారని అంటున్నారు. అత్యధిక సంఖ్యలో వచ్చే ప్రేక్షకులను కంట్రోల్ చేయటం థియోటర్స్ యాజమాన్యంకి చాలా కష్టంతో కూడుకున్న పని అంటున్నారు. అలాగే 60 శాతం మంది ప్రేక్షకులు థియోటర్ టికెట్ కౌంటర్ కి  చేరుకోవటం మాట పక్కన పెడితే…ఆ థియోటర్ గేటుని కూడ టచ్ చేయలేనంత పరిస్థితి ఉంటుందని అంటున్నారు.


అందుకే మొదటి రోజు సినిమా చూడాలనే ఆశని పక్కన పెట్టి…మూడు రోజుల తరువాత సినిమాను వెళ్లే ప్లానింగ్ చేసుకోవాలని అంటున్నారు. అలా కాకుండా థియోటర్స్ కి మొదటి రోజే వస్తే…వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే బాహుబలి2టికెట్స్ మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్ అంటూ బోర్డులు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. మొత్తంగా బాహుబలి2ఫీవర్ అన్ని రంగాలపై ప్రభావితం చూపుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: