తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సీక్వెల్ గా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమాలో కూడా  సెకండ్ పార్ట్ పై క్యూరియాసిటీ పెంచే విధంగా తీయలేదు.  కానీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో మాత్రం క్లయిమాక్స్ చాలా అద్భుతంగా తీశారు.  ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన కట్టప్ప వెన్నుపోటు పోడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  అయితే అప్పటి నుంచి అందరి మదిలో ఒకటే ప్రశ్న..కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.
Image result for BAHUBALI 2 new posters
 ఈ ప్రశ్న భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కలిగిన సందేహం.  అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న విషయం రాజమౌళి చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ వచ్చాడు.  ఈ విషయంపై ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇతర విషయాలపై డైవర్ట్ చేస్తూ వచ్చాడు.  అంతే కాదు ఇందులో నటులు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు తప్ప అన్ని జవాబులు చెబుతున్నారు.  అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్న కథనాలు వెలువడుతున్నాయి.  

తాజాగా హీరో ప్రభాస్ ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో క్లారిటీ ఇచ్చాడు.  బహుశా బల్లాల దేవుడ్ని చంపబోయి చీకట్లో కట్టప్ప బాహుబలిని హతమార్చి వుంటాడనే ఒపీనియన్‌ని వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయం ఆయన నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో కొత్త చర్చలు మొదలయ్యాయి.  
Related image
సినిమా రిలీజ్‌కి రెండురోజుల ముందు ప్రభాస్ ఈ సీక్రెట్‌ని నార్మల్‌గా బయటపెట్టడమే ఆశ్చర్యకరం. రెండేళ్లుగా  అభిమానులను వెంటాడుతున్న ఈ ప్రశ్నకు ఇలా సింపుల్‌గా బాహుబలి తేల్చేయడాన్ని పెద్దగా ప్రయార్టీ లేని విషయంగా చెప్పుకోవచ్చునని అంటున్నారు.  ఏది ఏమైనా మరో రెండు రోజులు ఐదు సంవత్సరాల నిరీక్షణ ఫలితం దక్కబోతుందని అంటున్నాడు ప్రభాస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: