తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బాహుబలి 2 సినిమాపై నే అందరి చర్చలు.  దేశంలో ఎక్కడ చూసినా బాహుబలి మానియా పట్టుకుంది.  చిన్న పెద్దా అనే తేడా లేకుండా బాహుబలి 2 సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.  మొదటి పార్టు లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ఒకటి అయితే..సెకండ్ పార్ట్ లో అద్భుతమైన వ్యూజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో దీనిపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.  

రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బాహుబలి చిత్రం ఇంకా రెండు రోజుల్లో థియేటర్లలో ప్రదర్శితమవుతుంది.  ఇక ఈ సినిమా చూసేందుకు అభిమానులు టిక్కేట్ల కోసం ఎగబడుతున్నారు.  దీంతో  థియేటర్ల యాజమాన్యం పండుగ చేసుకుంటున్నారు..కొన్ని థియేటర్లలో బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతుండగా కొంత మంది దొంగ సైట్లతో ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముతున్నారు.  
Related image
ఇదంతా పక్కన బెడితే తాజాగా ఢిల్లీలో  పీవీఆర్ థియేటర్‌లో ఒక్క టికెట్ రూ. 2400గా ఉంది. బాహుబలిపై అభిమానుల పిచ్చిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కొన్ని థియేటర్లు. ఫస్ట్‌పార్ట్‌కి థియేటర్ల ముందే బ్లాక్‌లో టికెట్లు అమ్మగా, ఈసారి ఆన్‌లైన్‌లో భారీ రేటుకి అమ్మకాలు సాగిస్తున్నాయి కొన్ని వెబ్‌సైట్లు. తొలిరోజు మూవీ చూడాలన్న ప్రేక్షకుడి ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్నాయి.  
Image result for baahubali 2 ticket q line
ఇక నగరాల విషయాలకు వస్తే ఒక్కో థియేటర్లలో ఒక్కో రకంగా అమ్ముతున్నారు.   ఇక థియేటర్ల వద్దయితే టికెట్ల కోసం కిలో‌మీటర్ల మేరా బారులు తీరారు. ముఖ్యంగా, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కోచి వంటి నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామునుంచే అభిమానులు ఐమ్యాక్స్‌ వద్ద బారులు తీరారు.  ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నా..బాహుబలి మానియా ముందు ఏవీ పనికి రావడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: