తెలుగు సినిమా చరిత్రను తిరగ వ్రాస్తుంది అన్న భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న ‘బాహుబలి 2’ సినిమా రిలీజ్ కోసం చాలామంది ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటే అసలు ‘బాహుబలి 2’ సినిమాను చూడొద్దంటూ మెగా ఫ్యాన్స్ పేరుతో కొందరు చేస్తున్న రచ్చ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి 2’ కు పెరిగిపోయిన క్రేజ్ ను చూసి కొంతమంది ఈర్ష్యతో మెగా ఫ్యాన్స్ పేరును వాడుకుంటూ ఈ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘బాహుబలి 2’ ని చూడద్దు అంటూ ఒక మెసేజ్ ను ఎవరు పంపారో తెలియకపోయినా ప్రస్తుతం ఈ మెసేజ్ వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. వాట్సాప్ లో తిరుగుతున్న ఆ మెసేజ్ సారాంశం ప్రకారం ''నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానివా? ఒక వారం వరకు బాహుబలి-2 చూడటం మాను. నువ్వు ఒక చిరు, పవన్, అర్జున్, చరణ్, సాయిధరమ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే  ‘బాహుబలి’ థియేటర్ దరిదాపుల్లో కనిపించకు’ అన్న సారాంశంతో ఈ మెసేజ్ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.

అయితే ఇటువంటి మెసేజ్ ప్రచారంలోకి రావడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ పవన్ ‘కాటమరాయుడు’ సినిమాలకు సంబంధించి అదనపు షోలు వేయడానికి స్పెషల్ షోలు వేయడానికి అనుమతులు అప్పట్లో సరిగ్గా లభించలేదు. 

దీనితో ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ స్థాయిలో అత్యంత భారీ ఓపెనింగ్స్ రావలసి ఉండి కూడ అందుకోలేకపోయాము అన్న ఫీలింగ్ మెగా అభిమానులలో ఉన్నట్లు టాక్. ఈ బాధ ఇప్పుడు ‘బాహుబలి 2’ మ్యానియాతో ఒకేసారి బయటకు వచ్చి ఇటువంటి మెసేజ్ లు పెట్టె స్థితికి మెగా అభిమానులను తీసుకు వచ్చింది అని కొందరంటున్నారు. 

అయితే మెగా అభిమానులు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయరని రికార్డులను సృష్టించడంలో చిరంజీవి పవన్ ల స్థాయికి ఏ హీరో సరిపోదు అన్న గర్వం ఆ అభిమానులలో ఉందని చాలామంది భావిస్తున్నారు. దీనితో మెగా అభిమానుల వంకతో ఎవరో కావాలని ఇలా ‘బాహుబలి 2’ పై బురద జల్లుతున్నారు అంటూ మెగా అభిమానులలోని ఒక వర్గం అభిప్రాయ పడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: