‘బాహుబలి ది కంక్లూజన్’  రిలీజ్ కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ఈరోజురాత్రికి ప్రదర్శింపబోతున్న ప్రీమియర్ షోల టాక్ గురించి అందరు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈసినిమా టాక్ ఎలా ఉంటుంది అన్న ఆశక్తికన్నా చాలామంది ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడనే సీక్రెట్ తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు అన్న విషయం ఓపెన్ సీక్రెట్.

ఈనేపధ్యంలో తామే ముందుగా ఈవిషయం తెలుసుకుని పదిమందికీ చెప్పేయాలని  చాలామంది తహతహలాడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈహంగామా ఎక్కువగా కనిపిస్తోంది. ఈపరిస్థుతుల మధ్య కొందరు ప్రభాస్ అభిమానులు ఎఫ్ ఎం రేడియోలకు కూడా ఫోన్ చేసి కట్టప్ప సీక్రెట్ గురించి బయటకు చెప్పద్దని కొందరు జనాలు రిక్వెస్ట్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు కొందరు ఫేస్ బుక్ ట్విట్టర్ లలో కూడా కట్టప్ప సీక్రెట్ ను బయటకు  చెప్పవద్దని కొన్ని స్వీట్ బెదిరింపులు మొదలయ్యాయి అన్న వార్తలు కూడ వస్తున్నాయి. అంతేకాదు కట్టప్ప సీక్రెట్ ను చెప్పేస్తే వాట్సాప్ లో తమ గ్రూప్ నుంచి తప్పించి అన్ ఫ్రెండ్ అయిపోతావ్ జాగ్రత్త అంటూ చిన్నగా వార్నింగ్ లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 
ఎవరో ఎక్కడో మొదలెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారి సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. దీనినిబట్టి చూస్తూ ఉంటే ‘బాహుబలి 2’ లోని కట్టప్ప సీక్రెట్ ఏస్థాయిలో పరాకాష్టకు చేరిందో అర్ధం అవుతుంది. అయితే ఎవరో పెట్టిన మెసేజ్ ని చూసి ‘బాహుబలి 2’ లోని కట్టప్ప సీక్రెట్ ను అంత రహస్యంగా ఉంచే వ్యక్తులు ఉన్నారా ? అన్నదే ప్రశ్న. 

ప్రస్తుతం ఉన్న పరిస్థుతులలో ఒక సీక్రెట్ జనానికి తెలిస్తే అది లీక్ కాకుండా ఆపగల శక్తి భగవంతుడుకి కూడ లేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈరోజు తెల్లవారే లోపే ‘బాహుబలి 2’ టాక్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సీక్రెట్ బయటకు రావడం సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో ఇదీ అంతే నిజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: