ఈ మద్య సినిమాలు ఇలా రిలీజ్ కి ముందు నుంచి  వాటికి సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్ లు అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  వాటి సంబంధించిన  రివ్యూలు, లైక్స్, అన్ లైక్స్  కూడా అదే విధంగా ఊదరగొడుతున్నాయి.  కొన్ని హిట్ అంటే..మరి కొన్ని సినిమాలు ఫ్లాప్ అంటున్నారు.  కానీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఏంటో జనాలు చూసి చెబుతున్నారు.  అయితే కొంత మంది రివ్యూరైటర్స్ చెప్పేవి చూస్తే సినిమా చూడాలా వద్దా.. అన్న అనుమానాలు కూడా కలుగుతుంటాయి.  
Image result for gabbar singh brahmotsavam
ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడుతున్నారు.  అయితే రివ్యూ పాజిటీవ్ అంటే సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు..నెగిటీవ్ అంటే అటు వైపే వెళ్లకుండా ఉంటున్నారు.   ఉమైర్ సందు ఫేమస్ రివ్యూ రైటర్..ఈయన ఇస్తున్న సినిమా రేంటిగ్స్ ని బట్టి కొన్ని సినిమాలు నిజంగా చూడదగ్గవే దగ్గవే అయినా..ఫలితాలు మాత్రం  కొన్ని సార్లు తారుమారు అవుతున్నాయి.   
Image result for baahubali 2 new posters
 ఈ మద్య స్టార్   హీరోల సినిమాలు  సూపర్ డూపర్ హిట్ అంటూ డిజాస్టర్ సినిమాలకు సైతం 5కు 4 ఒక్కోసారి 5కు 5 రేటింగ్ ఇస్తూ ప్రేక్షకుల సహనం నశించేలా చేస్తున్నాడు ఉమైర్ సందు అనేవాడు . ఇతగాడు ఇప్పటివరకు ఇచ్చిన రేటింగ్ లలో ఒక్క సినిమా మాత్రమే సూపర్ హిట్ అవ్వగా ఇప్పటి వరకు భారీ రేటింగ్ లు ఇచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ లు అయ్యాయి .

మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రానికి అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలకు కూడా భారీ రేటింగ్ నెటిజన్లకు లేని పోని ఆశలు కల్పించాడు.  తీరా థియేటర్లో చూస్తు సినిమాలో ఏమీ లేదని కస్సు బుస్సు మన్నారు ఆడియన్స్.  తాజాగా బాహుబలి 2 సూపర్ ..... బంపర్ అంటూ ఆకాశానికి ఎత్తేయడమే కాకుండా 5/ 5 రేటింగ్ ఇచ్చేసాడు . బాహుబలి 2 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు అయితే ఉమైర్ సందు ఇచ్చిన రేటింగ్ చూసి షాక్ అవుతున్నారు.  ఇంతకీ ఈ సినిమా బాహుబలిని బీట్ చేస్తుందా..లేదా తుస్..మంటుందా అన్న అనుమానంలో పడ్డారు. 

ఉమర్ ట్విట్ :


మరింత సమాచారం తెలుసుకోండి: