‘బాహుబలి 2’ మొదటిరోజు మొదటి షోకు సంబంధించిన న్యూస్ బయటకు వస్తోంది. ఈ న్యూస్ ఒక విధంగా చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘బాహుబలి’ సినిమా కథకు ఎంతో కీలకమైన కట్టప్ప పాత్రలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు రాజమౌళి. 

‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప సీరియస్ గా కనిపిస్తే ఈరెండో భాగంలో అతని చేత నవ్వులు కురిపించాడు రాజమౌళి.  అంతేకాదు ఈమూవీలో సుబ్బరాజుతో చేయించిన కామెడీ కూడ ప్రేక్షులను బాగా అలరిస్తోంది. దీనితో ప్రస్తుతం యూత్ కోరుకుంటున్న కామెడీని కూడ ‘బాహుబలి 2’ లో మిస్ కాకుండా చూసి రాజమౌళి ఈసినిమా ఘన విజయం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్ధం అయిపోతోంది.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే కీలక ఘట్టాన్ని చాల చాకచక్యంగా చూపించడంతో పాటు అనుష్కను వీరనారిగా చూపించడంలో రాజమౌళి కనపరిచిన ప్రతిభ అందరి ప్రశంసలు పొందుతోంది.  ఇక ఈసినిమాలో అన్ని పాత్రలనూ బలమైనవిగా మలచడంలో జక్కన్న సృజనాత్మకతను ప్రతిఫ్రేమ్ లోను కనిపించింది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమాను చూసినవారు కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లోకంలోకి విహరింపచేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు అంటే ఈ మూవీ ప్రేక్షకులకు ఏస్థాయిలో నచ్చిందో అర్ధం అవుతుంది. దీనితో ‘బాహుబలి బిగినింగ్’ కంటే ‘బాహుబలి కన్‌క్లూజన్’ బాగుంది అన్న టాక్ అప్పుడే వైరల్ లా స్ప్రెడ్ అవుతున్న నేపధ్యంలో ఈసినిమా రాజమౌళి 1000 కోట్ల కలలను నిజం చేయడం ఖాయం అని అంటున్నారు. 

దీనికితోడు ఈసినిమాలో ఎక్కడా అనవసరమైన డైలాగ్స్ సన్నివేశాలు లేకపోవడం మరింత ప్లస్ గా మారింది. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో రమారాజమౌళి పడిన శ్రమ, కనబర్చిన ప్రతిభ అడుగడుగునా కనిపిస్తోంది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చివరిగా ఒక్క మాటలో ముగించాలి అంటే ఈసినిమా తెలుగువాడి గొప్పతనాన్ని చాటే కళా ఖండంగా చరిత్రలో నిలబడి పోతుంది అని అంటున్నారు. ఒకనాటి ‘మాయాబజార్’ ‘లవకుశ’ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలులా ఒక ట్రెండ్ సెటర్ గా ఈమూవీ మిగిలి పోవడం ఖాయం. ఈసినిమా సాధించిన ఘన విజయాన్ని చూసి కోస్తా జిల్లాలలో ప్రభాస్ అభిమానులు జరుపుకుంటున్న సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: