ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన ‘బాహుబలి 2’ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాకు సంబంధించి ఎక్కడా డివైడ్ టాక్ లేకపోవడంతో మరో రెండు వారాలపాటు బాక్స్ ఆఫీసు వద్ద ‘బాహుబలి 2’ ప్రభంజనం తప్ప మరే విషయం కనిపించదు. 

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ‘బాహుబలి ది కంక్లూజన్’ చిన్నాపెద్దా అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా అందరి హీరోల అభిమానులను తన ధియేటర్లకు రప్పించుకునే స్థాయిలో ఉంది అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే ఈసినిమాను చూసిన విమర్శకులు మాత్రం ఈసినిమాలోని ఒక ప్రధానమైన లోపాన్ని బయటకు తీస్తున్నారు. 

ఈమూవీ ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం సుదీర్ఘంగా సాగతీతగా అనిపించింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీ సెకండ్ ఆఫ్ లో వచ్చిన పాత్రలు అన్నీ తమ పాత్రలలో ఇమిడిపోయి సగటు ప్రేక్షకుడుకి బోర్ అనిపించకపోయినా సెకండ్ ఆఫ్ నిడివి విషయంలో రాజమౌళి కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఉంటే మరింత బాగుండేది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఈ సెకండ్ ఆఫ్ పెద్దది అవ్వడంతో సినిమా నిడివి పెరిగిన నేపధ్యంలో ఈమూవీని చూడటానికి రిపీటెడ్ గా ప్రేక్షకులు రాజమౌళి కోరుకున్న రీతిలో ధియేటర్లకు వస్తారా అన్న సందేహాలను మరికొందరు విమర్శకులు వ్యక్త పరుస్తున్నారు. రాజమౌళి ఈమూవీకి 1000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ ను పెట్టుకున్న నేపధ్యంలో ఈసినిమాను సాధారణ ప్రేక్షకుడు కనీసం రెండు సార్లు అయినా చూడనిదే ఈ భారీ కలక్షన్స్ టార్గెట్ ను అందుకోవడం కష్టం.

అయితే రాజమౌళికి తన కథ పై ఉన్న మితిమీరిన విశ్వాసంతో పాటు ‘బాహుబలి 2’ ఏర్పడిన విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ సెకండ్ ఆఫ్ నిడివి విషయంలో రాజమౌళి పెద్దగా శ్రద్ధ పట్టి ఉండడు అన్న కామెంట్స్ మరికొందరు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసినిమా ఘన విజయంతో ప్రేక్షకులు సినిమా స్క్రీన్ ప్లే బాగుంటే ఎంత నిడివి ఉన్నా పట్టించుకోరు అన్న విషయం మరొకసారి రుజువైంది..
 


మరింత సమాచారం తెలుసుకోండి: