ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసిన బాహుబలి సినిమా విడుదలైంది. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రాజమౌళి అండ్ టీమ్ సంవత్సరాల తరబడి కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమాకు కూడా మంచి రిపోర్టులు వస్తున్నాయి. ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచిన అంశాల్లో సంగీతం ఒకటి. 

బ్యాగ్రౌండ్ స్కోర్ లో కీరవాణిని తీసేయాలంటూ...
ఐతే.. బాహుబలి 1కు మంచి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి.. సెకండ్ పార్ట్ కు మాత్రం ఆకట్టుకునే మ్యూజిక్ ఇవ్వడంలో విఫలమయ్యాడని కొందరు ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి బాహుబలి 2 సినిమాను అత్యద్భుతంగా తీసినా.. కీరవాణి మాత్రం మ్యూజిక్ విషయంలో ఆశించిన స్థాయిలో అందివ్వలేదని కొందరు మాట్లాడారు. 

bahubali 2 keeravani music కోసం చిత్ర ఫలితం

భావోద్వేగాలు ప్రధానాంశంగా తెరకెక్కిన బాహుబలి 2 పార్ట్ కు సంగీతం చాలా కీలకమైన అంశం. అలాంటి ఈ సినిమా సంగీతం విషయంలో తాము సంతృప్తి చెందలేదని కొందరు ఫ్యాన్స్ ఫీలయ్యారు. కీరవాణి ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత బాగా వచ్చేదని అభిప్రాయపడ్డారు. ఐతే సినీ విమర్సకులు మాత్రం కీరవాణి సంగీతంపై సంతృప్తి చెందారు. ఈ సినిమాను నిలబెట్టిన అంశాల్లో కీరవాణి సంగీతం ఒకటి అని అభిప్రాయపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: