అంచనాలకు తగ్గట్టుగా బాహుబలి సినిమా రిలీజ్ అయ్యింది.. దేశ సినిప్రియులను ఏకం చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కాగా మన దేశంలో హయ్యెస్ట్ గా 6500 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని చోట్ల 95 శాతం ఆక్యుపెన్సీ సంపాదించిన ఈ సినిమా మొదటి రోజు కలక్షన్స్ తో సరికొత్త రికార్డులు సాధించడం ఖాయమని అంటున్నారు.


కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే దాదాపు 35 కోట్లు వసూళు చేసిన ఈ సినిమా మొదటి రోజు 100 కోట్లు సునాయాసంగా సంపాదిస్తుందని అంటున్నారు. క్రౌడ్ చూస్తే అది నిజమే అనక తప్పదు. ఇక బాహుబలి ప్రభంజనంలో ఓవర్సీస్ కూడా తలమునకలవుతుంది. ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో 19 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది బాహుబలి-2.


ఇక అసలు బాహుబలి-2 మొదటి రోజు ఎంత వసూలు చేసింది అన్నది మాత్రం ఇంకా ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేయలేదు. కచ్చితంగా బాలీవుడ్ సినిమాలకు ధీటుగా కాదు వాటికంటే భారీగానే మొదటి రోజు కలక్షన్స్ ఉంటాయని తెలుస్తుంది. ప్రభాస్ నటన, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ రెండు సినిమాకు ఊపిరి పోశాయి.


కచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి సువర్ణాక్షరాలతో రాసి ఉంచబడుతుంది. చూస్తుంటే అందరు ఊహించని విధంగా 1000 కోట్ల కలక్షన్స్ కూడా కొల్లగొట్టేలా ఉంది. అసలు బాహుబలి ఏ రేంజ్ లో కలెక్ట్ చేశాడు అన్నది రేపు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: