నందమూరి తారకరామారావు తరువాత కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజులు చేయలేని పనిని 1980 ప్రాంతాలలో చిరంజీవి చేసి దాదాపు రెండుదశాబ్దాలకు పైగా టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఏహీరోని తన దరిదాపుకు కూడ రానీయకుండా టాలీవుడ్ సింహాసనాన్ని కాపాడుకున్న చరిత్ర చిరంజీవి సొంతం. ఈమధ్యలో ఎన్నోవ్యతిరేక వర్గాలు చిరంజీవి స్థానాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నించినా ఆప్రయత్నాలు అన్నీ పగటికలలుగానే మారిపోయాయి. దాదాపు 25 సంవత్సరాలపాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన చిరంజీవి తరువాత ఆస్థానానికి దరిదాపుకు చేరువైన హీరోలు ఉన్నారు కాని చిరంజీవిలా నెంబర్ వన్ స్థానంలో సంవత్సరాలపాటు కొనసాగిన టాప్ హీరో ఎవరూ లేరు. 

పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ ఇలా అప్పుడప్పుడు ఒక బ్లాక్ బస్టర్ తో మెరుపులు మెరిపించినా తమ పవర్‌ను నిలకడగా కాపాడుకోలేకపోయారు. దీనితో చిరంజీవి తరువాత నెంబర్ వన్ అని అనిపించుకున్న హీరో ఇప్పటికీ రాలేదు. అయితే ప్రస్తుతం ఆస్థానాన్ని ప్రభాస్ అందుకోబోతున్నాడా అన్న ఆసక్తికర చర్చలుజరుగుతున్నాయి.  'మిర్చి' తర్వాత 'బాహుబలి’ 1 ఆ తరువాత ‘బాహుబలి 2' తో ప్రభాస్‌ స్టార్‌ ఇమేజ్‌ ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయి నేషనల్ స్టార్ గా మారిపోయాడు.

ప్రస్తుతం ‘బాహుబలి 2’ కలక్షన్స్ కు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం ఈమూవీ ఖచ్చితంగా 1000 కోట్ల కలక్షన్స్ సినిమాగా మారడం ఖాయం అనిఅంటున్నారు. దీనితో ఈమూవీలో హీరోగా చేసిన ప్రభాస్ 1000 కోట్ల హీరోగా మారిపోవడంలో ఎటువంటి సందేహంలేదు. ‘బాహువాలి’ మూవీ ఖ్యాతి అంతా రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయినా రికార్డుల పరంగా 1000 కోట్ల హీరో ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ పేరు గుర్తుకు వచ్చితీరుతుంది. దీనితో బాలీవుడ్ ఖాన్ హీరోల స్థానాన్ని డామినేట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు అని అభిప్రాయపడటంలో ఎవరు సందేహింప దగ్గ విషయాలులేవు. 

అయితే ప్రభాస్ కెరియర్ కు సంబంధించి అసలైన పరీక్ష ఇప్పటి నుంచే ప్రారంభం అయింది అని అంటున్నారు విశ్లేషకులు.  ‘బాహుబలి’ లాంటి స్థాయి ఉన్న సినిమాలు చేయడం అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం తరుచు అయ్యేపని కాదు. అయినా ప్రభాస్ పేరువినగానే ఆరేంజ్ హిట్స్ ను అతడి అభిమానులు ఆశిస్తారు. దీనికితోడు వరసగా హిట్స్ ను అందుకుంటూ పరాజయాలు లేకుండా చూసుకోవడానికి చాలతెలివితేటలు కావాలి. ఇప్పటికే యూత్‌లో, మాస్‌లో చాలా ఫాలోయింగ్‌ వున్న ప్రభాస్‌ అన్ని సెక్షన్స్‌ని ఆకట్టుకునే హీరోగా ఎదగాలి. 

హీరో అనిపించుకునే లక్షణాలు అన్నీ ఉన్న ప్రభాస్‌కి మిగతా యువహీరోల మాదిరిగా స్ట్రాంగ్‌ అభిమానుల బేస్‌ వారసత్వంగా రాలేదు. తనంతట తానుగా ఏర్పరచుకున్న అభిమానులే ప్రభాస్ కు ఎక్కువ. ఈపరిస్థుతులలో రాబోతున్నరోజులలో ప్రభాస్ ఎంచుకునే సినిమాల కథల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అంశంతో పాటు ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ మూవీ ఏమాత్రం అభిమానులను నిరాశ పరచకూడదు. అయితే ఈవిషయాలు అన్నీ చాల వ్యూహంతో పాటు అదృష్టం కూడ కలిసి వస్తే అతిత్వరలోనే చిరంజీవి నెంబర్ వన్ స్థానాన్ని ప్రభాస్ దోచుకోవడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: